ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన  తమిళ చిత్రం ‘అసురన్’తెలుగులో రీమేక్ కానుంది. ఈ యాక్షన్ డ్రామాను వెట్రిమారన్ తెరకెక్కించారు. దసరా సెలవుల్లో తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించింది ‘అసురన్’ చిత్రం.  హీరో వెంకటేష్.. ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు.  తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు.  

ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్ద. మీరు మంచి నటులు అని భావిస్తే సురేష్ ప్రొడక్షన్స్ వారికి మీ డిటేల్స్ పంపించండి.

స్టార్ హీరోల మొదటి సినిమా.. రిజెక్ట్ చేసిన దర్శకులు!

ఇక ఈ రీమేక్ కి దర్శకత్వం  వహిస్తారంటూ.. గత కొద్దిరోజుల నుంచి హను రాఘవపూడి , తరుణ్ భాస్కర్, ఓంకార్  వంటి కొందరి దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చాయి. అయితే వారందరినీ పక్కనబెట్టి సురేష్ బాబు ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ గా పేరుపొందిన శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు శ్రీకాంత్ అడ్డాల..స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లుగా చెప్తున్నారు.

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాలకి ఈ సినిమా ఆఫర్ పెద్ద ఛాలెంజే. ఇప్పటివరకు క్లాస్, ఫ్యామిలీ సెంటిమెంట్ల కథలను మాత్రమే చేసిన శ్రీకాంత్ అడ్డాల ఈ మాస్ రివెంజ్ సినిమాని ఎలా డీల్ చేస్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నట్లు చెప్తున్నారు.  ఈ మూవీలో మంజూవారియర్ పాత్రలో శ్రియ శరన్ నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.