బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్ 3' సినిమాపై హిందూ జాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. దబాంగ్ 3 సినిమాలోని పాటతో పాటు కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని తొలగించాలని హిందూ జాగృతి సమితి డిమాండ్ చేస్తోంది.

ఈ సినిమా పాటలతో పాటు కొన్ని సన్నివేశాల్లో సాధువులను కించపరిచారని, వాటిని ఈ సినిమా నుండి తొలగించాలని హిందూ జాగృతి సమితి సభ్యులు ముంబై సెన్సార్   బోర్డ్ తో పాటు మహారాష్ట్ర సర్కార్ కి డిమాండ్ చేశారు.

ఏప్రిల్ 15న హీరో నితిన్ పెళ్లి!

డిసెంబర్ 20వ తేదీన 'దబాంగ్ 3' సినిమా విడుదల కానున్న నేపధ్యంలో సాధువులను కించపర్చే సన్నివేశాలు, పాటను తొలగించాలని మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల హిందూ జాగృతి సమితి కోఆర్డినేటర్ సునీల్ ఘన్వాట్ డిమాండ్ చేశారు.

సినిమా నుండి అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించకపోతే తమ హిందూ జాగృతి సమితి కార్యకర్తలు సినిమా హాళ్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేస్తారని సునీల్ హెచ్చరించారు.  సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాలను వెంటనే తొలగించేలా మహారాష్ట్ర హోంశాఖ అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయాలని సునీల్ డిమాండ్ చేశారు.