సినిమాలో పాటల గురించి మన మేకర్లు బాగానే ఖర్చు చేస్తారు. అందులోనూ పెద్ద హీరోల పాటలకు సెట్ లు వేయడం, భారీగా చిత్రీకరించడం వంటివి చేస్తుంటారు. ఇప్పుడు బన్నీ సినిమా కోసం కూడా అలానే చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. రెండు పాటలు ఏకంగా 100 మిలియన్ల హిట్ లు దాటాయి. వీటిలో 'సామజవరగమన' పాటను విదేశాల్లో చిత్రీకరించారు. 'రాములో రాములా' పాట కోసం ఓ భారీ సెట్ వేసి.. రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసి చిత్రీకరించారు.

రివైండ్ 2019: నిర్మాతను నట్టేట ముంచిన భారీ డిజాస్టర్స్

అన్ని పాటల చిత్రీకరణ అయిపోయింది కానీ 'బుట్టబొమ్మ' పాట చిత్రీకరణ మిగిలింది. ఈ పాట కోసం రెండు సెట్లు వేస్తున్నారు. అన్నపూర్ణలో వేస్తున్న సెట్ లో మూడు నుండి ఐదు రోజుల పాటు చిత్రీకరణ ఉంటుంది. ఈరోజు నుండే ఆ పాటకి సంబంధించిన షూటింగ్ మొదలుకానుంది.

ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ విషయమేమిటంటే.. ఈ పాట కోసం వేస్తోన్న సెట్ లో వాడేందుకు విదేశాల నుండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ప్లాంట్స్ ని తెప్పించారు. కేవలం వీతికోసమే రూ.40 లక్షలు ఖర్చు చేశారట.

పాట పూర్తయిన తరువాత వాటిని మైంటైన్ చేయాలంటే కాస్త కష్టమే.. పోనీ వదిలించుకుందామంటే అన్ని లక్షలు ఖర్చు పెట్టి కొన్నవి ఫ్రీగా ఇవ్వలేరు. అలా అని కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారో..? రారో..? తెలియదు. మొత్తానికి ఒక్కో పాట కోసం చిత్రబృందం భారీగానే ఖర్చు చేస్తోంది.