రివైండ్ 2019: నిర్మాతను నట్టేట ముంచిన భారీ డిజాస్టర్స్

First Published 25, Dec 2019, 8:47 AM

తెలుగు సిని పరిశ్రమకు అన్నీ కవర్ చేస్తున్నట్లుగా  హిట్స్, ప్లాఫ్స్, డిజాస్టర్స్ ఇచ్చిన 2019 మరో వారంలో వెళ్ళిపోతోంది. సాయి శ్రీనివాస ఆత్రేయ, జెర్సీ, బ్రోచేవారెవరురా వంటి కొత్త తరహా కాన్సెప్ట్ చిత్రాలను ఇచ్చిన ఈ సంవత్సరం అదే చేత్తో నిర్మాతలను పూర్తిగా నట్టేట ముంచే సినిమాలను అందించింది. ఆ లిస్ట్ ని ఇక్కడ ఇస్తున్నాం.

బోయపాటి భారీ డిజాస్టర్.. రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయరామ చిత్రం రిలీజ్ కు ముందు ఓ రేంజిలో హైప్ క్రియేట్ చేసింది.అయితే రిలీజ్ అయ్యాక అర్దమైంది మాస్ పేరుతో బోయపాటి ఓ వరస్ట్ సినిమాని తీసాడు అని. ఆ స్దాయి చెత్త సినిమా ఈ సంవత్సరంలో మరొకరు బీట్ చేయలేని స్దాయిలో ఉందా చిత్రం. కామెడీ సీన్స్ ..కన్నీళిలు తెప్పిస్తే..ఎమోషన్ సీన్స్ నవ్వు తెప్పించే చిత్రమైన పరిస్దితి ఈ సినిమా క్రియేట్ చేసింది. ఇక యాక్షన్ సీన్స్ అయితే సూపర్ హీరోల సినిమాలను దాటి పోయింది. చావుబతుకుల్లో ఉన్న అన్నయ్య ఫోన్ చేసి తమ్ముడ్ని(రామ్ చరణ్) పిలిస్తే, హీరో ఎయిర్ పోర్ట్ కిటికీ నుంచి దూకేస్తాడు. అక్కడ నుంచి ఎగిరెళ్లి ట్రయిల్ మీద పడతాడు. అలానే నిల్చొని గుజరాత్ లోని ద్వారక నుంచి నేపాల్ బోర్డర్ వరకు కొన్నిగంటల్లో వెళ్లిపోతూ.... మధ్యలో  ఒకచోట ఆగి ఛాతి, వీపు నిండా పచ్చబొట్లు (టాటూలు) కూడా వేయించుకుంటాడు. ఈ సీన్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కడచోట ట్రోలింగ్ కు గురి అవుతోంది.

బాబోయ్ ఇదేం సీక్వెల్.. నాగార్జున కెరీర్ లోనే ఆల్ టైమ్ క్లాసిక్ మన్మధుడు. ఈ రోజు కు కూడా టీవీల్లో వేస్తే దాన్ని చూడకుండా ఉండలేదు. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటన రాగానే అందరూ ఫుల్ ఖుషీ అయ్యారు. రాహుల్ రవీంద్రన్ డైరక్ట్ చేసిన ఈ చిత్రం సీక్వెల్ అంటే విరక్తి పుట్టేలా ఒరిజనల్ మన్మధుడు చిత్రం సిగ్గుపడేలా తయారైంది. నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఈ చిత్రం వల్గర్ కామెడీ, లెస్బియన్ సీన్స్, చెత్త రొమాన్స్, బోరింగ్ స్క్రీన్ ప్లే తో 2019 వరస్ట్ చిత్రాల లిస్ట్ లో చేరిపోయింది.

బాలయ్య హ్యాట్రిక్.. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో తన తండ్రి బయోపిక్ ని తెరకెక్కించిన బాలయ్య ...వరస పెట్టి రెండు డిజాస్టర్స్ ఇచ్చాడు. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ లో కానీ, బాలయ్య ఫెరఫెర్మాన్స్ లోని ఎక్కడా లోటు లేకపోయినా, క్రిష్ దర్శకత్వం..ఆసక్తి లేని స్క్రీన్ ప్లే...తెలుగుదేశం వీరాభిమానులను సైతం దూరం పెట్టేలా చేసింది. ఆ సినిమాలు ఆ స్దాయిలో దెబ్బ తిన్నాయి కదా అని పూర్తి కమర్షియల్ హంగులతో బాలయ్య తన మార్క్ సినిమా రూలర్ ని కొద్ది రోజుల క్రితమే వదిలారు. ఆ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన అత్యంత అవుట్ డేటెడ్ సినిమాగా నిలిచింది. పోలీస్ ఆఫీసర్ ..జ్ఞాపకశక్తి కోల్పోయి సాప్ట్ వేర్ కంపెనీ సీఈఓ అనటం కామెడీగా మారిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా తేలింది.

బాహుబలి గాలి తీసేసింది.. బాహుబలి చిత్రంతో భారీగా క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. దాంతో ఆయన నెక్ట్స్ సినిమా సాహో కోసం అభిమానులంతా ఎదురుచూసారు. సంవత్సరాల తరబడి షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లో పెద్ద ప్లాఫ్ గా మిగిలింది.  అజ్ఞాతవాశికు మరో వెర్షన్ గా వచ్చిన ఈ చిత్రం పరమ బోర్ సీన్స్ తో ప్రభాస్ అబిమానులకు సైతం విసుగెత్తించింది. ఎక్కడో హిందీలో ఆడిన ఈ సినిమా తెలుగు నాట మాత్రం అలరించలేకపోయింది. 350 కోట్లతో తీసామని చెప్పిన ఈ సినిమా మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ కు లాస్ ప్రాజెక్టుగా మిగిలింది.

చిన్న చెత్త సినిమాలు.. ఇలా పెద్ద సినిమాలను ప్రక్కన పెడితే ఈ లిస్ట్ లో ఆర్ డి ఎక్స్ లవ్, హిప్పీ, 90 ఎమ్ ఎల్, చాణుక్య, ఆవిరి, అమ్మ రాజ్యంలో కమ్మ బిడ్డలు, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, ప్రేమ కథా చిత్రం 2, సీత, ఏడు చేపల కథ, బీచ్ రోడ్ చేతన్ ఇలా పెద్ద లిస్టే 2019లో తెలుగులో వచ్చిన డిజాస్టర్స్  కు ఉంది. రివ్యూ రైటర్స్ తప్ప మిగతా వాళ్లు ఎవరూ ఈ సినిమాలు పెద్దగా చూసిన పాపాన పోలేదు.

loader