Asianet News TeluguAsianet News Telugu

“ఫైటర్” లేటెస్ట్ ఇన్ఫో.. వెరీ ఇంట్రస్టింగ్!

అంతకు ముందు ఈ సినిమాకు నటీనటులు,టెక్నీషియన్స్ రెమ్యునేషన్స్ మినహా 15 కోట్లు బడ్జెట్ గా అంచనా వేసి రంగంలోకి దిగారు. అయితే ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి..పూరి ఈ సినిమా బడ్జెట్ ని 25 కోట్లు దాకా పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

Budget Increase to Vijay Deverakonda's Fighter?
Author
Hyderabad, First Published Jan 16, 2020, 3:28 PM IST

చాలాకాలంగా హిట్ లేక వెనక బడ్డ పూరి జగన్నాథ్ ఒక్కసారిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒడ్డునపడ్డారు. తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు . ఈ సినిమా సక్సెస్ తరువాత అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.  ఈ మేరకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీని స్టార్ట్ చేయబోతున్నారు.  పూరి, విజయ్ దేవరకొండ సినిమా కోసం ఫైటర్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసి వర్క్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ ని చూసి బడ్జెట్ ని పెంచేసినట్లు సమాచారం.

అంతకు ముందు ఈ సినిమాకు నటీనటులు,టెక్నీషియన్స్ రెమ్యునేషన్స్ మినహా 15 కోట్లు బడ్జెట్ గా అంచనా వేసి రంగంలోకి దిగారు. అయితే ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి..పూరి ఈ సినిమా బడ్జెట్ ని 25 కోట్లు దాకా పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

'ఎంత మంచివాడవురా' పరిస్దితి మరీ అంత దారుణమా..?

అయితే ఈ బడ్జెట్ పెంచటంతో బిజినెస్ పరంగా ఏ మేరకు రిస్క్ పెరుగుతుందనేది అంచనా వేస్తున్నారు. పూరి, విజయ్ దేవరకొండ కాంబో కాబట్టి ఖచ్చితంగా మంచి బిజినెస్ ఎక్సపెక్ట్ చేయవచ్చు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ ను కొత్తగా చూపించి మెప్పించిన పూరి, విజయ్ ను ఎలాంటి లుక్ లో చూపించబోతున్నారో చూడాలి.  
 
పదాలు సరిగా పలకలేని వ్యక్తి, జీవితంలో ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడు. తనకు ఎదురయ్యే సమస్యలపై ఫైటర్ గా నిలిచి ఎలా గెలుపు సాధిస్తాడు అనే పాత్రలో విజయ్ దేవరకొండ నటించనున్నాడని టాక్. ఫైటర్ షూటింగ్ ఈ నెల 20 నుండి ముంబైలో మొదలుకానుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌లో ఉన్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా ముంబైలో షూట్ చేయనున్నారు. ముంబైలో ముఖ్యంగా జుహు, తాజ్ హోటల్ లాంటి ఏరియాల్లో షూట్ చేయటానికి ప్లాన్ చేస్తోంది టీమ్. ఫైటర్‌లో శ్రీదేవి కూమార్తె జాన్వీ కపూర్ విజయ్ సరసన నటిస్తోంది.

అలాగే  “ఫైటర్” సినిమా తెలుగులోనే కాకుండా పలు ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతోందని తెలుస్తోంది. పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలవుతుందని సమాచారం.
 

Follow Us:
Download App:
  • android
  • ios