డైరెక్టర్ బోయపాటి శ్రీను టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరు. మాస్ చిత్రాలు తెరకెక్కించడంలో బోయపాటి దిట్ట. బోయపాటి కంటే ముందు టాలీవుడ్ లో చాలామంది మాస్ చిత్రాలు తెరకెక్కించే దర్శకులు వచ్చాయి. కానీ హీరోలని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయడంలో బోయపాటి స్టయిలే వేరు. 

బోయపాటి శ్రీను రొటీన్ కథలతో సినిమాలు రూపొందిస్తారనే విమర్శ ఉంది. వినయ విధేయ రామ చిత్రం నిరాశపరచడంతో బోయపాటిపై విమర్శలు ఎక్కువయ్యాయి. దీనితో ఈసారి బోయపాటి తన పంథా మార్చబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ 106వ చిత్రాన్ని బోయపాటి తెరకెక్కించబోతున్నాడు. 

ఈ చిత్రం కోసం బోయపాటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ చిత్ర కథ కూడా విభిన్నంగా ఉండబోతున్నట్లు టాక్. దీని కోసం బోయపాటి తన డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో మార్పులు చేస్తున్నాడట. తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేస్తున్న కొందరిని బోయపాటి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. 

రానా అడుక్కుంటే చెప్పాడు.. వెంకీమామ రిలీజ్ డేట్ ఫిక్స్!

కొత్తగా ఆలోచించగలిగే యువకులైన అసిస్టెంట్స్ ని చేర్చుకుంటున్నాడట. డిసెంబర్ లోనే బాలయ్య, బోయపాటి చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బాలయ్య, బోయపాటి కాంబోలో సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. దీనితో ఈ హ్యాట్రిక్ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రోజా నెగిటివ్ రోల్ లో నటించబోతున్నట్లు టాక్. కన్నడ బ్యూటీ రచిత రామ్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.