ఆదివారం తరువాత సంక్రాంతి సినిమాల హవా తగ్గింది. గత వారాంతానికి ముందే 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కానీ శని, ఆదివారాల్లో మళ్లీ పుంజుకుంది. వీక్ డేస్ లో ఆడియన్స్ పెద్దగా లేకపోవడంతో థియేటర్ల వద్ద సందడి తగ్గిపోయింది.

సంక్రాంతి సినిమాలు పాతబడిపోవడంతో కొత్త సినిమా 'డిస్కోరాజా' ఆకర్షిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది. 'అల.. వైకుంఠపురములో' సినిమా నాన్ బాహుబలి రికార్డులను దాటేసి అన్ని ఏరియాల్లో భారీ కలెక్షన్స్ ని రాబట్టింది.

డోస్ పెంచిన జాను టీమ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతిలో తన జోరు చూపించి ఫ్యామిలీ సినిమాలకి సంక్రాంతికి ఉన్న బంధాన్ని మరోసారి బలంగా చాటిచెప్పింది. దీంతో వచ్చే సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనే కోరిక చాలా మంది హీరోల్లో కలుగుతోంది.

'సరిలేరు నీకెవ్వరు' సినిమా వంద కోట్లకి పైగా షేర్ తెచ్చుకొని మహేష్ సినిమాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. 'మహర్షి' తరువాత మరోసారి మహేష్ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకున్నా నాన్ బాహుబలి రికార్డుల దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోతుంది.