కోలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచినా 96 సినిమా తెలుగులో జానుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. తమిళ్ లో విజయ్ సేతుపతి - త్రిష జంటగా నటించగా తెలుగులో శర్వానంద్ - సమంత నటించారు. అయితే ఈ కాంబినేషన్ పై మొదటి నుంచి ఆడియెన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. రీసెంట్ గా విడుదలైన జాను టీజర్ - ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది.  దీంతో ప్రమోషన్స్ డోస్ మరీంత పెంచాలని ఫిక్స్ అయ్యారు.

అయితే నేడు సినిమాకు సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో చిత్ర యూనిట్  ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీన సినిమా ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించేందుకు దిల్ రాజు టీమ్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. ఇక సినిమా జనవరి 7న రిలీజ్ కాబోతోంది.ఇక ఈ సినిమాతో కథానాయకుడు శర్వానంద్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

శర్వా చివరి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ని అందుకున్నాయి. మహానుభావుడు తరువాత ఈ హీరో సరైన సక్సెస్ అందుకోలేదు. పడి పడి లేచే మనసు - రణరంగం సినిమాలు రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన నష్టాలను మిగిల్చాయి. దీంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని శర్వా కష్టపడుతున్నాడు. మరీ నెక్స్ట్ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.