సినిమా స్టార్స్ బయటకు వస్తే అభిమానులను తట్టుకోవడం చాలా కష్టమైన పని. వారి అభిమానాన్ని కాదనలేక దగ్గరి కెళితే కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. ఇటీవల ఒక హీరోయిన్ కి జరిగిన ఇన్సిడెంట్ అందరిని షాక్ కి గురి చేసింది. సోషల్ మీడియాలో అందుకు సంబందించిన వీడియో వైరల్ గా మారింది. ఆమె మరెవరో కాదు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అడుగులు వేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. రెగ్యులర్ జిమ్ కి వెళ్లిన సారా జిమ్ నుంచి బయటకు వచ్చే క్రమంలో కొంత మంది అభిమానులను కలుసుకున్నారు. వారి అభిమానాన్ని కాదనలేక ఫొటోలకి పోజిచ్చారు. ఇక మరో అభిమాని కోరిక మేరకు షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో ఆమె అతను చేసిన పనికి షాక్ అయ్యింది. సడన్ గా తన చేతిని ముద్దాడడంతో సారా ఆశ్చర్యపోయింది.

సెక్యూరిటీ వెంటనే అతన్ని అక్కడి నుంచి తప్పించారు. కొంత గొందరగోళానికి గురైన సారా దేవుడా అనుకుంటూ కారు ఎక్కి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లి పోయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేదార్ నాథ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సారా ఆ తరువాత టెంపర్ రీమేక్ 'సింబా' లో నటించి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది. ప్రస్తుతం అమ్మడు రెండు సినిమాలతో బిజీగా ఉంది.

వైరల్ ఫొటోలు: బికినీలో స్టార్ హీరో కూతురు