సాధారణంగా సినిమాల్లో మన హీరోలు దొంగలను, అవినీతిపరులను వెంటాడి పట్టుకుంటూ ఉంటారు. కానీ అదే హీరోలు రియల్ లైఫ్ లో ఏమైనా జరిగితే మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వరు. కానీ ఒక హీరో మాత్రం తను రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు.

బెంగుళూరులో శుక్రవారం నాడు తెల్లవారుజామున క్యాబ్ డ్రైవర్ ని చోరీ చేసి పరారీ అవుతున్న ఇద్దరు దొంగలను వెంటాడి పట్టుకొని పోలీసులకు అప్పగించాడు హీరో రఘుభట్. హలసూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తెల్లవారు జామున 2.30 గంటలకు ఓ క్యాబ్‌ డ్రైవర్‌ను అబ్దుల్లా, మొహిన్‌ అనే ఇద్దరు దొంగలు అడ్డగించారు.

ఆ హీరోతో లిప్ లాక్.. ఇబ్బంది పడ్డా : పూజా హెగ్డే

అతడి వద్ద ఉన్న సొమ్ముని దౌర్జన్యంగా తీసుకొని ద్విచక్రవాహనంపై పారిపోవడానికి ప్రయత్నించారు. అదే మార్గంలో హీరో రఘుభట్ కారులో వస్తుండగా.. సంఘటనని గమనించారు. క్యాబ్‌ డ్రైవర్‌ నుంచి నగదు, బంగారు గొలుసు చోరీ చేసి పరారీ అవుతున్న దొంగలను రఘుభట్‌ గుర్తించి.. సుమారు రెండు కిలోమీటర్ల వరకు తన కారులో దొంగలను వెంటాడారు.

సెయింట్‌ జాన్సన్‌ సర్కిల్‌ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే రఘుభట్‌ ఆ ఇద్దరు దొంగలను పట్టుకొని.. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. మొహిన్‌ తలకు, అబ్దుల్లా చేయికి దెబ్బ తగిలింది. ఇద్దరినీ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.