బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలంటే కొంతమంది నార్త్ హీరోయిన్స్ కెరీర్ మొదట్లో ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించడం కామన్ అయిపొయింది. మొదట సౌత్ స్టార్ హీరోలతో సక్సెస్ అందుకొని అనంతరం ఈజీగా బాలీవుడ్ లో బిజీ అవ్వాలని ఈ కాలం హీరోయిన్స్ స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. బాహుబలి తరువాత ఆ డోస్ మరింత పెరిగింది.

 బాలీవుడ్ లో పెద్ద హీరోలతో నటించినప్పటికీ తెలుగులో అవకాశాలు వస్తే ఏ మాత్రం మిస్ చేసుకోవడం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. బాలీవుడ్ లో ఇటీవల హాట్ టాపిక్ గా మారిన బ్యూటీ సాయి మంజ్రేకర్ టాలీవుడ్ ఛాన్సులపై కూడా స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. రీసెంట్ గా సల్మాన్ ఖాన్  నుంచి వచ్చిన దబంగ్ 3 సినిమా ద్వారా ఈ బ్యూటీ వెండితెరకు పరిచయమైంది.

'ప్రతిరోజూ పండగే' మూడు రోజుల కలెక్షన్స్ !

సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ అమ్మడి గ్లామర్ కి బాలీవుడ్ ఫిదా అయ్యింది. సీనియర్ యాక్టర్ మహేష్ మంజ్రేకర్ కూతురైన సాయి ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక నెక్స్ట్ టాలీవుడ్ కుర్రహీరోలతో నటించడానికి సిద్దమవుతున్నట్లు టాక్. ముందుగా మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాలో అమ్మడు సెక్సీ రోల్ తో దర్శనమివ్వనున్నట్లు టాక్.

వరుణ్ నెక్స్ట్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా డిఫరెంట్ యాక్షన్ డ్రామాగా తెరక్కనుంది. ఇక సినిమాలో ఇద్దరి హీరోయిన్స్ కోసం వెతుకుతుండగా ఒక హీరోయిన్ గా సాయిని ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి స్పెషల్ ఎనౌన్స్మెంట్ రానుంది.