యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. బెల్లకొండ శ్రీనివాస్ నుంచి మంచి చిత్రాలే వస్తున్నాయి. బెల్లకొండ శ్రీనివాస్ చివరగా 'రాక్షసుడు' చిత్రంతో హిట్ అందుకున్నాడు. డాన్సులు, ఫైట్స్ విషయంలో ప్రతి చిత్రంలో శ్రీనివాస్ కు మంచి గుర్తింపు లభిస్తోంది. 

కానీ ఓ సాలిడ్ హిట్ కోసం బెల్లకొండ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు భాషా హద్దులు చెరిగిపోయాయి. హాలీవుడ్ చిత్రాలు కూడా ఇండియన్ మార్కెట్ లో వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నాయి. బాహుబలి ముందు వరకు సౌత్ చిత్రాలకు నార్త్ లో సరైన మార్కెట్ ఉండేది కాదు.

కానీ బాహుబలి విడుదలైన తర్వాత పరిస్థితి మారింది. బాలీవుడ్ వారు కూడా సౌత్ చిత్రాలవైపు చూస్తున్నారు. ఇక్కడ ప్రాంతీయ భాషల్లో విజయం సాధించిన చిత్రాలని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ వాళ్ళ కన్ను మరో సౌత్ సూపర్ హిట్ చిత్రంపై పడింది. తమిళంలో ఘనవిజయం సాధించిన రాక్షసన్ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నట్లు టాక్. 

విజయ్ దేవరకొండ మూవీ.. పూరి, ఛార్మి ఏం చేయబోతున్నారంటే..!

ఈ చిత్ర తెలుగు రీమేక్ లో బెల్లకొండ శ్రీనివాస్ నటించగా ఇక్కడ కూడానా మంచి విజయమే సాధించింది. ఉత్కంఠ రేపే ఈ సైకో థ్రిల్లర్ హిందీ రీమేక్ లో క్రేజీ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయుష్మాన్ వరుస విజయాలతో బాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటున్న ఆయుష్మాన్ దృష్టి ప్రస్తుతం రాక్షసన్ రీమేక్ పై పడ్డట్లు తెలుస్తోంది.