తరచుగా బాలీవుడ్ హీరోలు వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై బాలీవుడ్ తారలు కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాము. ఇదిలా ఉండగా స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ భారత దేశ చరిత్ర గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. 

ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పై సోషల్ మీడియాలో దారుణంగ్గా ట్రోలింగ్ జరుగుతోంది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన తానాజీ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇటీవల విడుదలైన తానాజీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సైఫ్ మాట్లాడుతూ.. బ్రిటీషర్ల వచ్చే వరకు ఇండియా అనే కాన్సెప్ట్ లేదని అన్నారు. 

బ్రిటిషర్లు రాక మునుపు ఇండియా అనే భావన ప్రజల్లో లేదని అన్నారు. సైఫ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. చరిత్ర తెలుసుకో అంటూ ట్రోల్ చేస్తున్నారు. బ్రిటిష్ వారు రాగానే ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. అంతకు 150 ఏళ్ల మునుపే వాస్కోడి గామా, కొలంబస్ లాంటి వాళ్ళు మన దేశాన్ని ఇండియా అనే పిలిచారు అంటూ నెటిజన్లు సైఫ్ కు చరిత్ర పాఠాలు చెబుతున్నారు. 

కుర్రాళ్ళ హృదయాలు గల్లంతయ్యే హాట్ నెస్.. రాశి ఖన్నా ఫొటోస్

సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్ నటించిన తానాజీ చిత్రం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బ్రిటిషర్లు వచ్చే వరకు ఇండియా అనే కాన్సెప్ట్ లేదని సైఫ్ ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ.. నెటిజన్లలోకి మాత్రం తప్పుడు సంకేతాలు వెళ్లాయి. అందుకే చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.