కామెడి అండ్ యాక్షన్ మిక్స్ చేసి ఎంటర్టైన్ చేయడంలో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టిది డిఫరెంట్ స్టైల్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా గోల్ మాల్ సిరీస్ లతో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్స్ అందుకే దర్శకుల్లో ఒకరు.

డిప్రెషన్ లో ఇలియానా.. సైకియాట్రిస్ట్ సహాయంతో..!

ఇకపోతే రీసెంట్ గా రోహిత్ శెట్టి ఒక స్పెషల్ కారును కొనుగోలు చేశారు. మూడు కోట్ల రూపాయల విలువైన లంబోర్గిని ఉరూస్ కారుతో దిగిన రోహిత్ శెట్టి స్పెషల్ పిక్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. పసుపు రంగులో ఉన్న  కారు చాలా స్టైలిష్ గా ఉందని ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ప్రముఖ ‘లంబోర్గిని ముంబై’ స్టోర్ వారు కూడా రోహిత్ శెట్టి స్పెషల్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సక్సెస్ ఫుల్ దర్శకుల్లో ఒకరైన ఇండియన్ ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టికి కారును డెలివెరి చేసినట్లు పేర్కొన్నారు.  అలాగే ఉరుస్ లాంటి స్టయిలిష్  డిఫరెంట్  కారు ఇలాంటి దర్శకుడికి అవసరమేనని అది అతని వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేస్తుందని వివరణ ఇచ్చారు.

ఇకపోతే గత ఏడాది సింబా సినిమాతో రోహిత్ శెట్టి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు టెంపర్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఆ చిత్రం రన్ వీర్ సింగ్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిని. ప్రస్తుతం రోహిత్ శెట్టి అక్షయ్ కుమార్ తో సూర్య వన్షి అనే సినిమా చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది.