ప్రముఖ బాలీవుడ్ నటి నేహా ధుపియా తాను గర్భం దాల్చిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదని.. కానీ సెట్ లో వారికి అవమానం వచ్చిందని అంటున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తాను తల్లి కాబోతున్నప్పుడు పడిన కష్టాల గురించి వెల్లడించారు.

దాదాపు పదిహేనేళ్లపాటు నచ్చింది తినకుండా నోరు కట్టేసుకున్నానని.. అందుకే గర్భం దాల్చినప్పుడు ఇష్టం వచ్చింది తినేశానని.. అయితే అలా తినేసి కూర్చోకుండా.. బాగా వ్యాయామాలు చేశానని అన్నారు. గర్భం దాల్చినప్పటికీ ఉదయాన్నే లేచి సెట్స్ కు వెళ్లిపోయేదాన్ని.. ఆ లైఫ్ బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ భానుశ్రీ.. ఇన్నర్స్ కనిపించేలా బోల్డ్ షో!

అయితే తను పనిలో ఉన్నప్పుడు తిండి విషయంలో నోరు కట్టేసుకొని కూర్చోలేదని.. చాలా రోజుల వరకు గర్భం దాల్చిన విషయం ఎవరికీ చెప్పలేదని.. కానీ సెట్ లో ఉన్నప్పుడు నచ్చిన ఫుడ్ తినేస్తుంటే చాలా మందికి డౌట్ వచ్చిందని.. ఎప్పుడూ లేనిది ఇలా తినేస్తున్నావ్ అని అడిగేవారని గుర్తు చేసుకున్నారు.

గర్భిణులను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది.. 'మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీకు నచ్చిందే చేయండి.. ప్రెగ్నెంట్ అయినంత మాత్రాన జీవితంలో అన్ని విషయాలను మార్చేయలను అనుకోవద్దు' అంటూ చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ నటుడు అంగద్ బేడీతో డేటింగ్ లో ఉన్నప్పుడే నేహా తల్లయింది. దాంతో వెంటనే వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరికి మెహర్ అనే మగబిడ్డ పుట్టాడు.