స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలసి మరోమారు సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశారు. 

దీనితో అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి హిండస్ట్రీ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ పెర్ఫామెన్స్, పూజా హెగ్డే గ్లామర్, తమన్ అందించిన సంగీత ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని ప్రతి పాట సూపర్ హిట్ గా నిలిచింది. 

@theshilpashetty

Bhutta Booma Shilpa Shetty Style 💃 #bhuttabooma #telegu #lovedanceing #dancewithshilpa #duetwithme #fyp

♬ original sound - SwAmy PriyAzz💕

ముఖ్యంగా రాములో రాములా, సామజవరగమన, బుట్టబొమ్మ సాంగ్స్ ఉర్రూతలూగించాయి. బుట్ట బొమ్మ పాటకు అల్లు అర్జున్, పూజా హెగ్డే కలసి చేసిన డాన్స్ కేవలం తెలుగు ప్రేక్షకులని మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది. 

40 ఏళ్ల వయసులో తల్లైన హీరోయిన్లు.. ఇంత ఆలస్యం కావడానికి కారణం ఇదే!

సెలెబ్రిటీలు సైతం బుట్టబొమ్మ సాంగ్ కు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ స్టార్ శిల్పా శెట్టి ఇటీవల బుట్టబొమ్మ సాంగ్ కు టిక్ టాక్ వీడియో చేశారు. ఈ వీడియోలో శిల్పాశెట్టి డాన్స్ మతిపోగోట్టే విధంగా ఉంది. ఇప్పటికే ఈ వీడియోకి 1.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 

బ్యాగుల్లో కూడా పట్టనంత డబ్బు.. విజయ్, బిగిల్ ఫైనాన్సియర్ ఇంట్లో..

కొన్ని రోజుల క్రితం మలయాళీ హీరోయిన్ మంజు వారియర్ కూడా బుట్టబొమ్మ సాంగ్ పై వీడియో చేశారు. క్రమంగా బుట్టబొమ్మ సాంగ్ నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ గా మారుతోంది. అల్లు అర్జున్ తదుపరి చిత్రం క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.