బాలీవుడ్ క్రేజీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు దీనమైన స్థితి ఎదురైంది. ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం(95) శనివారం రోజు మృతి చెందారు. జైపూర్ లోని తన నివాసంలో సయీదా తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా సయీదా అనారోగ్యంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఇర్ఫాన్ ఖాన్ ఇండియాలో లేరు. 

ఆయన చికిత్స కోసం విదేశాలలో ఉన్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇర్ఫాన్ ఖాన్ ప్రత్యక్షంగా తన తల్లిని కడసారి చూసుకోలేని పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ వల్ల ప్రస్తుతం విమాన సౌకర్యాలు లేవు. దీనితో కుటుంబ సభ్యులు ఇర్ఫాన్ ఖాన్ లేకుండానే సయీదా బేగం అంత్యక్రియలని పూర్తి చేస్తున్నారు. 

స్టార్ హీరోతో సోనియా గాంధీకి పోలిక.. నోరు మూసుకో, ఉతికారేసిన హరీష్ శంకర్

కరోనా ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నివారణ చర్యల్లో భాగంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. 

ఇక ఇర్ఫాన్ ఖాన్ గత ఏడాది క్యాన్సర్ కు గురైన సంగతి తెలిసిందే. విదేశాల్లో చికిత్స చేయించుకున్న ఇర్ఫాన్ కొంతవరకు కోలుకున్నారు. ప్రస్తుతం చికిత్స కోసం ఆయన విదేశాల్లోనే ఉన్నారు. బాలీవుడ్ లో ఇర్ఫాన్ ఖాన్ తన అద్భుత నటనకు గాను ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.