Asianet News TeluguAsianet News Telugu

స్టార్ హీరోతో సోనియా గాంధీకి పోలిక.. నోరు మూసుకో, ఉతికారేసిన హరీష్ శంకర్

క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ లో మాస్ చిత్రాలకు బ్రాండ్ గా మారిపోయాడు. గబ్బర్ సింగ్, మిరపకాయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే లాంటి చిత్రాలు హరీష్ శంకర్ కు మాస్ డైరెక్టర్ అనే ఇమేజ్ తీసుకు వచ్చాయి.

Harish Shankar fires on senior senior journalist
Author
Hyderabad, First Published Apr 26, 2020, 9:35 AM IST

క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ లో మాస్ చిత్రాలకు బ్రాండ్ గా మారిపోయాడు. గబ్బర్ సింగ్, మిరపకాయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే లాంటి చిత్రాలు హరీష్ శంకర్ కు మాస్ డైరెక్టర్ అనే ఇమేజ్ తీసుకు వచ్చాయి. హరీష్ సైలెంట్ గా తన సినిమాలు తాను తీసుకునే రకం కాదు. తన దృష్టికి వచ్చిన ఎలాంటి అంశం గురించి అయినా హరీష్ సోషల్ మీడియాలో స్పందిస్తాడు. 

ప్రస్తుతం సోనియా గాంధీ, బిజెపి నాయకుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఓ ప్రముఖ జర్నలిస్ట్ పై కొందరు వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ఆ జర్నలిస్ట్ ఎవరో కాదు అర్నబ్ గోస్వామి. దాడి తర్వాత అర్నబ్ సోషల్ మీడియాలో సోనియా గాంధీ రౌడీలే తనపై దాడి చేశారని ఆరోపించారు. 

దీనితో అప్పటి నుంచి బిజెపి నాయకులు సోనియాపై.. కాంగ్రెస్ అభిమానులు బిజెపిపై ట్రోలింగ్ కు దిగారు. తాజాగా శేఖర్ గుప్తా సీనియర్ జర్నలిస్ట్ బిజెపిని విమర్శిస్తూ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోనియా గాంధీపై వచ్చిన ఆర్టికల్ ని ట్వీట్ చేశాడు. ఆ ఆర్టికల్ లో.. భారతీయురాలైన సోనియాగాంధీని ఇటలీ వ్యక్తిగా.. కెనడియన్ అక్షయ్ కుమార్ ని ఇండియన్ గా చిత్రీకరించే ప్రయత్నాన్ని బిజెపి చేస్తోందని కామెంట్ చేశారు. 

ఈ వ్యాఖ్యలపై దర్శకుడు హరీష్ శంకర్ కు చిర్రెత్తుకొచ్చినట్లు ఉంది. దీనితో సదరు జర్నలిస్ట్ ని హరీష్ శంకర్ ఏకిపారేశారు. 'మీరు ఇలాంటి వరస్ట్ కంపారిజన్ చేయడం సిగ్గు చేటు.. అక్షయ్ కుమార్ ఈ దేశానికి కోట్లాది రూపాయల సాయం అందించాడు.. కానీ మీ మేడం ఏం చేసింది.. మీరు బిజెపిని విమర్శించాలనుకుంటే విమర్శించుకోండి.. కానీ సినిమా వ్యక్తులని టచ్ చేసే సాహసం చేయవద్దు. 

ఒక వేళ అక్షయ్ కుమార్ కెనడాకు చెందిన వ్యక్తే అయినా మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అతడు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు.. దేశంపై పెత్తనం చలాయించడానికి ప్రయత్నించడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే కన్నా మీరు నోరు మూసుకోవడం బెటర్ అంటూ హరీష్ శంకర్ శేఖర్ గుప్తాకు చురకలంటించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios