ఈ ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా జెర్సీ ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. అయితే జెర్సీ కమర్షియల్ గా  అనుకున్నంతగా లాభాలని అందించలేకపోయింది. అయితే అదే కథ ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. సినిమాలో ఉన్న పాయింట్ నార్త్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని దిల్ రాజు - అల్లు అరవింద్ రీమేక్ చేయడానికి సిద్దమయ్యారు.  

ఇకపోతే సినిమాలో కథానాయకుడిగా నానై చేసిన పాత్రలో కబీర్ సింగ్ ఫెమ్  షాహిద్ కపూర్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో సక్సెస్ అందుకున్న షాహిద్ కపూర్ మరో టాలీవుడ్ రీమేక్ తో సక్సెస్ కొట్టడానికి సిద్దమయ్యాడు. క్లాసిక్ హిట్ గా నిలిచిన నాని జెర్సీ సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇక హీరోయిన్ గా మృణళ్ ఠాకూర్ ని ఫైనల్ చేశారు.  సూపర్ 30 - బట్లా హౌజ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ  ఈ బ్యూటీకి అవకాశాలు పెద్దగా ఆదుకోవడం లేదని ఇటీవల బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఫైనల్ గా మంచి రీమేక్ లో బంపర్ అఫర్ కొట్టేసింది. తెలుగులో హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉండడంతో మృణల్ కెరీర్ కు జెర్సీ రీమేక్ మంచి యూ టర్న్ ఇస్తుందని చెప్పవచ్చు.

సినిమా నిర్మాణంలో తెలుగు నిర్మాతలు ఉండడం విశేషం. దిల్ రాజు అల్లు అరవింద్ సినిమా రీమేక్ హక్కులను కొన్ని నెలల క్రితం దక్కించుకున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అమన్ గిల్ తో తెలుగు నిర్మాతలు చేతులు కలిపి జెర్సీ రీమేక్ కి ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇక కథ ఒరిజినల్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అదే తరహాలో బాలీవుడ్ లో తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు.

సరిలేరు నీకెవ్వరు: వంశీ పైడిపల్లికి మహేష్ రిక్వెస్ట్

వేరే ఆలోచన లేకుండా షాహిద్ కబీర్ సింగ్ సెంటిమెంట్ తో జెర్సీ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాబాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 250కోట్లకు పైగా లాభాల్ని అందించింది. ఇక అదే తరహాలో జెర్సీ సినిమాతో సక్సెస్ అందుకోవాలని షెడ్యూల్స్ ని ఫిక్స్ చేసుకున్నాడు. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఆగస్టు 28న రిలీజ్ చేయాలనీ సిద్ధమవుతున్నారు.