టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా డౌన్ ఫాల్ చూసింది రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ బ్యూటీకి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేవు. ఆమె క్రేజ్ తగ్గడం, కొత్త హీరోయిన్ల హవా పెరగడంతో రకుల్ కి ఛాన్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. తమిళంలో ఒకట్రెండు సినిమాలు 
చేస్తూ కాలం గడుపుతోంది.

యంగ్ హీరోతో డేటింగ్ పై పవన్ హీరోయిన్ క్లారిటీ!

ఇటీవల నితిన్, చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో రకుల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. స్టార్ హీరోలతో నటించిన రకుల్.. నితిన్ లాంటి చిన్న హీరోతో నటించడానికి అంగీకరించిందంటే ఆమె పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.  అయితే ఎన్నడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో రకుల్ బోల్డ్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

ఇటీవల బీచ్ లో బికినీ వేసుకొని ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. తన లుక్స్ తో అటు దర్శకనిర్మాతలను ఇటు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు తన బోల్డ్ షో కలిసొచ్చినట్లు ఉంది. బాలీవుడ్ లో ఓ ఛాన్స్ వచ్చేలా చేసింది. అర్జున్ కపూర్ హీరోగా 'లవ్ ఆజ్ కల్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటివరకు రకుల్ బాలీవుడ్ లో చేసిన సినిమాలేవీ పెద్దగా వర్కవుట్ కాలేదు.

ఇటీవల నటించిన 'దే దే ప్యార్ దే' మాత్రం మంచి హిట్ అందుకుంది. కానీ అందులో మరో హీరోయిన్ కూడా ఉండడంతో రకుల్ కి సక్సెస్ క్రెడిట్ పెద్దగా రాలేదు. అయినప్పటికీ 'లవ్ ఆజ్ కల్ ' సినిమాలో ఆమెకి ఛాన్స్ రావడం విశేషమనే చెప్పాలి.

లేడీ డైరెక్టర్ కాశ్వీ నాయర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో ఇలియానా, పూజా హెగ్డే, కృతి కర్భందా వంటి నటీమణులకు ఇలానే బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. కానీ సక్సెస్ కాలేకపోయారు. మరి రకుల్ అయినా సక్సెస్ అవుతుందేమో చూడాలి..!