పవన్ కళ్యాణ్ నటించిన 'తీన్మార్' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది నటి కృతికర్బందా. ఆ తరువాత 'ఒంగోలు గిత్త', 'బ్రూస్ లీ' వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ అక్కడ అరకొర అవకాశాలు దక్కించుకుంటూ కాలం గడుపుతోంది.

గత కొంతకాలంగా కృతి బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి వీరే కీ వెడ్డింగ్' అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి 'పాగల్ పంతీ' అనే సినిమాలో నటిస్తున్నారు. నవంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇండియాన్ మార్కెట్ లో హాలీవుడ్ హవా.. బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలో కృతి ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించింది. హీరో పులకిత్ తో డేటింగ్ లో ఉన్నానంటూ వార్తలు వస్తున్నాయని.. అలాంటి రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లను ఏమనగలమని ప్రశ్నించారు. ఇద్దరం జంటగా అందంగా ఉంటామని, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి ఎవరైనా సరే ఇద్దరం డేటింగ్ లో ఉన్నామని అనుకుంటారని చెప్పింది.

పులకిత్ ఎప్పటికీ తనకు చాలా స్పెషల్ అని.. పులకిత్ ఏంటో తనకు బాగా తెలుసని.. తనేం ఆలోచిస్తాడో కూడా తెలుసనీ.. మాటల ద్వారా ఇద్దరం బాగా దగ్గరయ్యామని చెప్పింది. పులకిత్ మంచి వాడని, పెద్దవాళ్లతో పాటు సహనటులను కూడా బాగా గౌరవిస్తాడని కృతి చెప్పుకొచ్చింది.

'పాగల్ పంతీ' సినిమాలో పులకిత్ తో కలిసి పనిచేయడం చాల బాగుందని.. సెట్ లో అన్ని విషయాల్లో పులకిత్ చురుకుగా ఉంటాడని.. ఆ విషయం తనకు బాగా నచ్చుతుందని కృతి చెప్పుకొచ్చింది.