సాధారణంగా సినిమాకు ఓ డైరక్టర్ ఉంటారు. ఎప్పుడో కానీ జంట డైరక్టర్స్ కనపడరు. కానీ సురేష్ బాబు వంటి సీనియర్ నిర్మాత ఉంటే ఏదైనా సాధ్యమే. ఇప్పుడు ఆయన తన తాజా చిత్రం కోసం ఇద్దరు డైరక్టర్స్ తో పనిచేయిస్తున్నట్లు వినపడుతోంది. తన సోదరుడు వెంకటేష్ తో చేస్తున్న నారప్ప చిత్రం కోసం శ్రీకాంత్ అడ్డాలని దర్శకుడుగా ఎంచుకున్న ఆయన... అందులోని యాక్షన్ పార్ట్ కోసం మరో డైరక్టర్ ని ఆశ్రయించినట్లు సమాచారం. అతను మరెవరో కాదు వెంకీ మామ దర్శకుడు బాబి. బాబి పనితీరు నచ్చిన ఆయన నారప్పలో యాక్షన్ ఎపిసోడ్స్ కు ఎంచుకున్నట్లు సమాచారం.

అప్పుడెప్పుడో నాగార్జున నటించిన రాజన్న చిత్రాన్ని ప్రముఖ రచయిత విజియేంద్రప్రసాద్ డైరక్ట్ చేస్తే, అందులో యాక్షన్ పార్ట్ ని రాజమౌళి చేసారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరగబోతోందని సమాచారం. ఎమోషన్స్ ని బాగా పండిస్తాడని పేరున్న శ్రీకాంత్ అడ్డాల...యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో ఏ మేరకు న్యాయం చేస్తాడో అని సందేహం వచ్చి రిస్క్ తీసుకోవటం ఎందుకుని సురేష్ బాబు ఈ డెసిషన్ తీసుకున్నాడంటున్నారు.

వెంకటేష్ 'నారప్ప' ఫస్ట్ లుక్.. సర్ ప్రైజ్ చేసిన శ్రీకాంత్ అడ్డాల!

అయితే శ్రీకాంత్ అడ్డాల ఈ విషయంలో ఏ మాత్రం అభ్యంతరం పెట్టలేదట. అయితే ఈ ఒరవడి కరెక్ట్ కాదంటున్నారు సినిమావాళ్లు. ఎందుకంటే ఇదే కరెక్ట్ దారి అని రేపు ప్రతీ నిర్మాత ఇదే పద్దతిలో ముందుకెళ్లే అవకాసం ఉందని అంటున్నారు. అయితే ఆ విషయం సురేష్ బాబుకు చెప్పేదెవరు.

తమిళ హిట్‌ చిత్రం ‘అసురన్‌’ రీమేక్‌ ని శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అనంతపురం ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ కథాంశంగా రూపొందబోయే రీసెంట్ గా నే మొదలుపెట్టారు. ఇందు కోసం అనంతపురం పరిసర ప్రాంతాల్లో కీలకమైన సెట్లు నిర్మించినట్లు తెలుస్తోంది. ఇందులో వెంకీ రెండు విభిన్నమైన లుక్స్‌లో దర్శనమివ్వబోతున్నారు.  

ఈ సినిమా కోసం సురేష్‌బాబు ‘నారప్ప’అనే టైటిల్‌ను ఫైనల్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని వదిలారు. ఈ సినిమాలో వెంకటేష్‌ ఇదే పాత్రలో దర్శనమివ్వనున్నారు.  ఇందులో వెంకీకి జోడీగా ప్రియమణి కనిపించబోతుందట. ధనుష్‌ హీరోగా వెట్రి మారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం.. గతేడాది దసరా కానుకగా విడుదలై కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.150కోట్ల వసూళ్లు సాధించింది.