Asianet News TeluguAsianet News Telugu

హీరో విజయ్ ని బీజేపీ టార్గెట్ చేసిందా..? రచ్చ చేస్తోన్న ఫ్యాన్స్

అభిమానులు భారీగా విజయ్ నివాసానికి తరలి వస్తున్నారు. బీజేపీ కావాలని హీరోని టార్గెట్ చేసిందని చెబుతున్నారు. గతంలో మూడు సార్లు విజయ్ సినిమాల్లో బీజేపీ కి కౌంటర్ ఇచ్చే విధంగా డైలాగ్స్ చెప్పారు. 

BJP targeted Hero Vijay..?
Author
Hyderabad, First Published Feb 6, 2020, 11:45 AM IST

కోలీవుడ్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నటుడు, దళపతి విజయ్‌ ని షూటింగ్ మధ్యలోనే విచారణ జరిపిన అధికారులు ఇప్పుడు చెన్నైలోని విజయ్ నివాసాలను కూడా టార్గెట్ చేశారు. ఇక ఉదయాన్నే విజయ్ ఇంటికి చేరుకున్న ఆఫీసర్స్ నిర్విరామంగా విజయ్ ని విచారిస్తున్నారు.

ఈ క్రమంలో విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా విజయ్ నివాసానికి తరలి వస్తున్నారు. బీజేపీ కావాలని హీరోని టార్గెట్ చేసిందని చెబుతున్నారు. గతంలో మూడు సార్లు విజయ్ సినిమాల్లో బీజేపీ కి కౌంటర్ ఇచ్చే విధంగా డైలాగ్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

హీరో విజయ్ ఇంట్లో ఐటి సోదాలు.. భారీగా తరలి వచ్చిన అభిమానులు

బీజేపీ కావాలనే విజయ్ పై ఐటీ దాడులు జరిపిస్తూ క్ష తీర్చుకుంటున్నారని అభిమానులు అంటున్నారు. ఈ ఐటీ రైడ్స్ సినీ వర్గాలతో పాటు, రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారాయి. గతంలో విజయ్ నటించిన 'మెర్సల్' సినిమా సంస్థతో సంబంధం ఉన్న పన్ను ఎగవేత కేసుకి సంబంధించి ఐటీ అధికారులు విజయ్ ని ప్రశ్నిస్తున్నారని సమాచారం.

అయితే ఆ సినిమాలో జీఎస్టీని హేళన చేస్తూ డైలాగ్స్ ఉన్నాయి. దీనిపై బీజేపీ నేతలు అప్పట్లోనే తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇక 'సర్కార్' సినిమాలో కూడా బీజేపీని ఉద్దేశిస్తూ విజయ్ పొలిటికల్ సెటైర్లు వేశారు. ఈ కారణాలతోనే తమ హీరోని బీజేపీ టార్గెట్ చేసిందంటున్నారు ఫ్యాన్స్.

బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి పనులు చేసినా.. ఇంకం టాక్స్ రైడ్స్ కి బలవుతుంటారని.. బీజేపీ పొలిటికల్ గేమ్స్ ఆడుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా దీనిపై వార్ మొదలుపెట్టారు.

'westandwithvijay' అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. స్టూడెంట్ ఫెడెరేషన్స్ సైతం విజయ్ కి సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియాకి పరిమితమైన ఈ గొడవ ఇంకెక్కడి వరకు వెళ్తుందో చూడాలి!

 

 

Follow Us:
Download App:
  • android
  • ios