త‌మిళ  స్టార్  విజ‌య్ హీరోగా ‘రాజా రాణి’ ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘విజిల్’. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25 న ఈ సినిమా విడుదల చేస్తున్నారు.  రేపు హైదరాబాద్‌ లో ‘విజిల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్  భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్న ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్‌బాల్ అభివృద్ధికి తోడ్పడే మార్స్ ఫుట్‌బాల్ ఫౌండేషన్‌కు చెందిన 20 మంది బాలికలకు మరియు 20 మంది అబ్బాయిలకు ఫుట్‌బాల్ కిట్‌ లను అందించటానికి ఏర్పాట్లు చేసింది.

చిత్రం కంటెంట్ విషయానికి వస్తే... మహిళల ఫుట్‌బాల్‌ జట్టు నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో  క్రీడాకారులుగా నటించిన అమ్మాయిలకి చెన్నై ఫుట్‌ బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో మూడు నెలలపాటు శిక్షణ ఇప్పించారు. హీరో విజయ్‌ కూడా ఫుట్‌బాల్‌ ఆట కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడంతో పాటు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకొన్నారు.

ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ని మెచ్చుకోకుండా ఉండలేం!

ఇక గతంలో విజయ్ అట్లీ కాంబినేష‌న్‌లో విడుద‌లైన తెరి(పోలీస్‌), మెర్స‌ల్‌(అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్  హిట్ కొట్టాయి. దాంతో  ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా బిగిల్‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న‌య‌న‌తార హీరోయిన్‌ గా న‌టిస్తోన్న‌ ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌ మెంట్స్ ప‌తాకం పై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. హీరో విజ‌య్‌ కెరీర్‌ లో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. తెలుగులో విజయ్‌ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో సినిమాని విడుదల చేస్తున్నారు.