ఇటీవల తమిళనాట ఒక ఫ్లెక్సీ కూలి యువతి మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంసంగా నిలిచింది. అన్నాడీఎంకే పార్టీ నేత ఒకరు తన ఇంట్లో ఫంక్షన్ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్ కూలి ఒక యువతి మరణించింది. దీంతో ఆ రాష్ట్రంలో ఫ్లెక్సీలపై, హోర్డింగ్ లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.

ఈ మధ్యకాలంలో ఫంక్షన్స్, పెళ్లిళ్లు, సినిమా రిలీజ్ లు ఇలా ఏ సందర్భంగా ఉన్నా.. వెంటనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అలవాటుగా మారింది. ముఖ్యంగా రాజకీయ  నాయకులకు, సినిమా వాళ్లకు ఫ్లెక్సీలతో ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ వాటి కారణంగా యువతి మరణించడంతో ప్రజల నుండి అసహనం వ్యక్తమయింది.

షాకింగ్.. బిగిల్ డైరెక్టర్ రెమ్యునరేషన్ అంతా.. స్టార్ హీరోలకే దిమ్మతిరిగేలా!

ఈ విషయంపై సినిమా వాళ్లు కూడా స్పందించారు. ఇకపై తమ ఫ్యాన్స్ ఎవరూ సినిమాలకు సంబంధించి కానీ, పుట్టినరోజులకు గానీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయొద్దని స్టార్ హీరోలు ప్రకటించారు. విజయ్, అజిత్ లాంటి హీరోలు పబ్లిక్ గా తమ అభిమానులకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయకూడదని సూచించారు. ప్రస్తుతం విజయ్ నటించిన 'బిగిల్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

 

సాధారణంగా తమిళనాట తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే రచ్చ మాములుగా ఉండదు. కానీ ఈసారి విజయ్ ఫ్యాన్స్ మాత్రం అతడు చెప్పిన మాట ఫాలో అవుతూ ఫ్లెక్సీలకు దూరంగా ఉన్నారు. తమ హీరో పిలుపుకు కట్టుబడి ఉండబోతున్నట్లుగా ట్వీట్లు చేస్తున్నారు. 'బిగిల్' సినిమా విడుదల సందర్భంగా ఫ్లెక్సీల హడావిడి ఉండదని వారు చెబుతున్నారు.

వాటి కోసం ఖర్చు పెట్టే డబ్బుని సొసైటీలో మంచి పనుల కోసం వినియోగిస్తున్నారు. పబ్లిక్ ప్లేసెస్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు. తమ అభిమానహీరో సినిమా విడుదల సందర్భంగా అలాంటి ఏర్పాట్లు చేసి, స్థానికంగా ప్రముఖులతో వాటిని ఆవిష్కరించబోతున్నారు. విజయ్ ఫ్యాన్స్ చేస్తోన్న ఈ మంచి పనులను మెచ్చుకోకుండా ఉండలేం..