కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'బిగిల్' సినిమాను తెలుగులో 'విజిల్' పేరుతో విడుదల చేశారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. 

సినిమా విడుదలై ఐదు రోజులు దాటుతున్నా విజయ్ అభిమానులు ఇప్పటికీ థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. విజయ్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ దీపావళికి విజయ్ ఇచ్చిన గిఫ్ట్ తో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 

రామ్ మహా ముదురు, అసలు మ్యాటర్ దాచేశాడు!

అట్లీ, విజయ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ సినిమా కూడా రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా రూ.200 కోట్ల కలెక్షన్స్ దాటేసి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.

మొదట ఈ సినిమాకి ఓ వర్గం ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ సినిమా మాత్రం కలెక్షన్స్ విషయంలో ముందుకు దూసుకుపోతుంది. అమెరికాలో కూడా ఈ  సినిమా భారీ వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది.

ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటివరకు 1 మిలియన్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో మాత్రం ఈ సినిమా వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మరే సినిమాలు లేకపోవడం 'బిగిల్' కి కలిసోస్తోంది.