Asianet News TeluguAsianet News Telugu

ఉంటానికి ఇల్లు లేదు కానీ.. కాస్ట్లీ కారు కావాలా? రాహుల్ సింప్లిగంజ్ పై ట్రోల్స్!

నిజానికి ఇది కూడా రాహుల్ కి హెల్ప్ అయింది. బిగ్ బాస్ షో గనుక గెలిస్తే.. ముందుగా తన తల్లితండ్రుల కోసం ఓ అపార్ట్మెంట్ కొంటానని చెప్పాడు రాహుల్. ఫైనల్ గా రాహుల్ విన్నర్ గా గెలిచి తన టాలెంట్ నిరూపించుకున్నాడు.

BiggBoss 3 Telugu Winner Trolled For Benz Car
Author
Hyderabad, First Published Jan 6, 2020, 3:16 PM IST

బిగ్ బాస్ సీజన్ 3లో ఎవరికీ రానంత సింపతీ రాహుల్ సిప్లిగంజ్ కి వచ్చింది. శ్రీముఖి టార్గెట్ చేయడం, వరుణ్ తో గొడవ వంటి విషయాలు రాహుల్ కి సింపతీని తీసుకొచ్చాయి. హౌస్ లో ఉన్నంతకాలం మిడిల్ క్లాస్ అబ్బాయి అంటూ తనకు తాను స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నాడు. నిజానికి ఇది కూడా రాహుల్ కి హెల్ప్ అయింది. బిగ్ బాస్ షో గనుక గెలిస్తే.. ముందుగా తన తల్లితండ్రుల కోసం ఓ అపార్ట్మెంట్ కొంటానని చెప్పాడు రాహుల్.

ఫైనల్ గా రాహుల్ విన్నర్ గా గెలిచి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. అయితే రియాలిటీకి వచ్చేసరికి.. రాహుల్ హౌస్ నుండి బయటకి రాగానే లగ్జరీ హెయిర్ సెలూన్ ఓపెన్ చేశాడు. 'హెయిర్ స్టైలింగ్' రాహుల్, అతడి తమ్ముడు సిద్ధహస్తులు. న్యూయార్క్ లో హెయిర్ స్టైలింగ్ కోర్సులు కూడా చేశారు.

స్టేజ్ పై విజయశాంతితో చిరు రొమాన్స్... పులిహోర కలిపేశాడంటూ ట్రోల్స్!

ఇక రీసెంట్ గా రాహుల్ మెర్సిడెజ్ బెంజ్ కారు కొన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఎంతో సంతోషంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఈ విషయం కొందరిని హర్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో రాహుల్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

'ఉండడానికి ఇల్లు లేదని చెప్పావ్.. కానీ లగ్జరీ సెలూన్ ఓపెన్ చేసావ్.. కాస్ట్లీ కారు కొన్నావ్.. అంటే అబద్ధాలు చెప్పి మమ్మల్ని చీట్ చేశావా..?' అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'నీకు సొంతిల్లు లేదు కానీ హైదరాబాద్ ట్రాఫిక్ లో చేజ్ చేయడానికి బెంజ్ కార్ కావాలి.. సూపర్బ్' అంటూ వెటకారంగా విమర్శలు చేస్తున్నారు.

అతడు మిడిల్ క్లాస్ నుండి వచ్చాడని.. అతడి సింప్లిసిటీ నచ్చి చాలా మంది ఓట్లు వేశారు. అటువంటి వారు ఇప్పుడు రాహుల్ తమని మోసం చేసినట్లుగా భావిస్తున్నారు. కానీ రాహుల్ మాత్రం ఇలాంటి ట్రోలింగ్ ని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు నటుడిగా కూడా టర్న్ తీసుకున్నాడు. కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాతో నటుడిగా వెండితెరకి పరిచయం కానున్నాడు.   

Follow Us:
Download App:
  • android
  • ios