బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా పాల్గొన్న రాహుల్ ఫైనల్స్ కి చేరుకున్నాడు. షో పూర్తి కావడం మరో నాలుగు రోజులే సమయం ఉండడంతో కంటెస్టంట్స్ కోసం వారి కుటుంబసభ్యులు, స్నేహితులు క్యాంపైనింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ స్నేహితుడు, సింగర్ నోయల్ కూడా రాహుల్ కి ఓట్లు వేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 

అయితే కొన్నిరోజులుగా రాహుల్ ని టార్గెట్ చేస్తూ నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై నోయెల్ మండిపడ్డాడు. ఇటీవల రాహుల్ పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోల్లో రాహుల్ బూతులు మాట్లాడారని, అతడికి ఓట్లు వేయకూడదని నెగెటివ్ ప్రచారం చేశారు.

Bigg Boss 3: వీడియో చూసి ఎమోషనల్ అయిన వరుణ్

దీనిపై స్పదించిన నోయెల్.. ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడు సడెన్ గా వీడియోలు రిలీజ్ చేయడమేంటని ప్రశ్నించారు. ఇంకానయం చిన్నప్పుడు డైపర్ లో సుస్సూ పోశాడని,  అప్పుడు బ్రెష్ చేస్కోలేదని పెట్టలేదు అంటూ వెటకారం చేశాడు. హౌస్ లోకి వెళ్లి ఒక గేమ్ ని ఆడుతున్నప్పుడు అక్కడి పరిస్థితులను బట్టి నామినేట్ చేయాలి.. మనం ఓట్లు వేయాలి అంతేకానీ బయట విషయాల గురించి కాదూ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ నెగెటివ్ ప్రచారం ఎవరు చేస్తున్నారో..? ఎందుకు చేస్తున్నారో మరి.. పాత వీడియోలన్నీ ఇప్పుడు పెట్టడం ఏంటి కామెడీగా అంటూ విమర్శించారు. చాలా మంది తనను కూడా ట్రోల్ చేస్తున్నట్లు చెప్పిన నోయెల్.. రాహుల్ కి ఓటు వేస్తున్న వారిని గొర్రెలు అని, తనను గొర్రెల బ్యాచ్ లీడర్ అని అంటున్నట్లు చెప్పాడు.

గొర్రెలకు ఒక పాజిటివ్ నెస్ ఉందని.. అవి కేవలం గొర్రెలకాపరి వెనకే వెళ్తాయని. ఎవరివెనక పడితే వారితో వెళ్లవని అన్నారు. 'మేం గొర్రెలం అయితే మీరేంటి..? నక్కలా..? కుక్కలా..?' అంటూ మండిపడ్డాడు. నిజంగానే మీకు శ్రీముఖికి సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి అంతేకానీ ఈ నెగెటివిటీ ఎందుకు అంటూ ప్రశ్నించాడు.  వ్యక్తిగతంగా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు.