బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకి చేరుకుంది. పదిహేడు మంది కంటెస్టంట్స్ తో మొదలైన ఈ షో ఫైనల్ వీక్ కి చేరుకునేసరికి హౌస్ లో ఐదుగురు కంటెస్టంట్స్ మిగిలారు. వీరిలో ఎవరు విజేతగా నిలవబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఓట్ల ప్రకారం అలీ, బాబా భాస్కర్ లు వెనుకబడ్డారు. వరుణ్ ఓ మోస్తరు ఓట్లు దక్కించుకుంటున్నాడు.

రాహుల్, శ్రీముఖిల మధ్య మాత్రం గట్టి పోటీ జరుగుతోంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ కి వారు వెళ్లిపోయే ముందు హౌస్ లో వారి జర్నీని వీడియోగా ప్లే చేసేవారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వంద రోజులు పూర్తయ్యాయి. దీంతో ఈసారి ఇంటి సభ్యులకు బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు.

'విజిల్' నా కథ.. కోర్టుకి వెళ్తా.. డైరెక్టర్ కామెంట్స్!

ఇప్పటివరకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో వాడిన వస్తువులతో ఓ గదిని మ్యూజియంగా ఏర్పాటు చేశారు. ఆ రూమ్ లోకి ఒక్కో కంటెస్టంట్ ని పిలిచి బిగ్ బాస్ ఇంట్లో కొనసాగిన వారి జర్నీని చూపించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.

ఇందులో వరుణ్ సందేశ్ కి తన జర్నీని చూపించారు. ఆ వీడియో చూసిన వరుణ్ ఎమోషనల్ అయ్యాడు. వంద రోజులకు పైగా కలిసి ఉన్న హౌస్ మేట్స్ అందరూ మరో నాలుగు రోజుల్లో ఎవరి దారిన వారు వెళ్లనున్నారు. దీంతో వారి జర్నీని చూపించి ఆ మెమోరీస్ నిమరోసారి గుర్తు చేయాలనుకున్నాడు బిగ్ బాస్. మరి హౌస్ మేట్స్ జర్నీ చూడాలంటే ఈరోజు ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు ఎదురుచూడాల్సిందే!