బిగ్ బాస్ సీజన్ 3 తమిళంలో కంటెస్టంట్ గా పాల్గొన్న మీరా మిథున్ షోపై సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటికే ఈ షోలో పాల్గొన్న నటి మధుమిత.. విజయ్ టీవీ ఛానెల్ పై ఆరోపణలు చేసింది. తనకు ముందుగా చెప్పిన పారితోషికం ఇవ్వలేదని మీడియా ముఖంగా చెప్పింది.

ఇప్పుడు అదే సీజన్ కి చెందిన మరో కంటెస్టెంట్ మీరా మిథున్ కూడా షోపై విమర్శలు చేసింది. శనివారం సాయత్రం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన మీరా మిథున్.. తాను బిగ్ బాస్ సీజన్ 3 పాల్గొని, దాని నుండి బయటకి వచ్చి రెండు నెలలు కావోస్తుందని చెప్పింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నందుకు గానీ, ఆ గేమ్ షో నిర్వాహకులు తనకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించింది.

‘అల...వైకుంఠపురములో...’ లో టబు లుక్ వచ్చేసింది!

ఈ విషయంపై విజయ్ టీవీ నిర్వాహ సంస్థ దగ్గరకి వెళ్లి అడగగా.. అక్కడ ఎవరూ సరిగ్గా స్పందించలేదని చెప్పింది. అది మోసపూరిత చర్యగా అనిపించిందని.. అదే విధంగా తన గురించి తప్పుడు ప్రచారం చాలానే జరుగుతోందని ఆరోపించింది. అందువల్ల విజయ్ టీవీ తనకు రూ.కోటి పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. 

ఇటీవల తను అందాల పోటీలు నిర్వహించినప్పుడు పోలీసులు అడ్డుపడి ఫైనల్స్ జరగకుండా ఆపేశారని.. తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపణలు చేసింది. తనకు ఈ రాష్ట్రంలో భద్రత కరువైందని.. పోలీసుల నుండే తనకు భద్రత లేకుండా పోతుందని సంచలన కామెంట్స్ చేసింది. 

అందుకే వేరే రాష్ట్రానికి వెళితే సురక్షితంగా జీవించగలనని చెప్పింది. కాగా.. సామాజిక అవగాన కలిగించాలని, దానికోసం త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నానని చెప్పింది. అయితే ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని ఇప్పుడే చెప్పనని వెల్లడించింది.