టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై నిన్న స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ 3 విన్నర్ కి టైటిల్ అందజేసి తన మాటలతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. ఇకపోతే షో ముగిసిన కొన్ని గంటలకే బిగ్ బాస్ 4 కి సంబందించిన రూమర్స్ మొదలవుతున్నాయి. నెక్స్ట్ సీజన్ హోస్ట్ ఎవరనేదానిపై అప్పుడే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

హోస్ట్ గా మెగాస్టార్ చిరాంజీవి దాదాపు ఫిక్స్ అయినట్లే అని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. స్టార్ మా ముందే ఈ విషయంపై మెగాస్టార్ తో చర్చినట్లు తెలుస్తోంది. అయితే మెగాస్టార్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది.

హాట్ అందాలతో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ!  

ఇక నెక్స్ట్ సీజన్ మొదలయ్యే లోపు మెగాస్టార్ 152 ప్రాజెక్ట్ ఎలాగూ పూర్తవుతుంది కాబట్టి సరికొత్తగా బిగ్ బాస్ 4కి హోస్ట్ గా చేస్తే బావుంటుందని మెగాస్టార్ సలహాలు కూడా అందుతున్నాయట. ఇక నాగార్జున ఎప్పటిలానే తన హోస్టింగ్ ఎట్రాక్ట్ చేశాడు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడుకి యాంకరింగ్ చేసిన విషయం తెలిసిందే.

నాగార్జున తరువాత మెగాస్టార్ ఆ షో బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి పోటీగా నాగార్జున హోస్టింగ్ కి మెగాస్టార్ పోటీగా వస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 4 మొదలుకావడానికి ఇంకా చాలా సమయం ఉంది. సో ఈ గ్యాప్ లో ఇప్పుడు అనుకున్నవి జరుగుతాయని గ్యారెంటీ లేదు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.