బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఓటింగ్ విషయంలో శ్రీముఖికి, రాహుల్ కి మధ్య గట్టి పోటీ నెలకొంది. అయినప్పటికీ రాహుల్ అత్యధిక ఓట్లతో టైటిల్ గెలుచుకున్నాడు. అలా హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత రాహుల్ క్రేజ్ బాగా పెరిగింది.

ఈ క్రమంలో ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ కొన్ని ఆసక్తికర విషయాలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు. హౌస్ లో శ్రీముఖితో గొడవ పెట్టుకున్న కారణంగానే సింపతీ పెరిగి రాహుల్ కి ఓట్లు పడ్డాయనే మాటలు వినిపిస్తున్నాయి.

heroine Raasi: డైరెక్టర్ తేజ నన్ను మోసం చేశాడు.. హీరోయిన్ రాశి కామెంట్స్!

ఇదే విషయమై రాహుల్ ని ప్రశ్నించగా.. తనుబిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేప్పుడు ఓటింగ్ విషయంలో ఎలాంటి ప్లాన్ చేసుకోలేదని... హౌస్ లో ఉన్నప్పుడు తనకు ఎన్ని ఓట్లు పడుతున్నాయో కూడా తెలియదని చెప్పాడు. అయితే శ్రీముఖి అన్ని వారాలు తనను నామినేట్ చేస్తానని చెప్పిన విషయాన్ని బహుసా జనాలు యాక్సెప్ట్ చేయలేక తనకు ఓట్లు 
వేసి గెలిపించారేమోనని అన్నాడు.

అయితే తన స్నేహితులు మాత్రం ఇంట్లో మనిషిలా అందరితో కలిసిపోవడం, జెన్యూన్ గా ఉండడమే నీ విజయానికి కారణమైందని చెప్పినట్లు రాహుల్ వెల్లడించాడు. హౌస్ లో ఉన్న రోజులు బయట ఏమైనా మిస్ అయ్యారా..? అని ప్రశ్నించగా.. రాహుల్ టక్కున 'రాములో రాములా' పాట అని చెప్పాడు.

అల్లు అర్జున్,  త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'అల వైకుంఠపురములో' సినిమాకి సంబంధించి ఇటీవల 'రాములో రాములా' అనే పాటను విడుదల చేశారు. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనక్కర్లేదు.

అయితే రాహుల్ గనుక అందుబాటులో ఉండి ఉంటే ఈ పాట తనతోనే పాడించాలని అనుకున్నారట. ఈ పాట మిస్ అయినందుకు రాహుల్ బాధపడ్డాడు. అలానే మరికొన్ని పాటలు కూడా మిస్ అయినట్లు చెప్పారు.