సీనియర్ హీరోయిన్ రాశి 90 దశకంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మిగిలిన హీరోయిన్లతో పోల్చుకుంటే ప్రేక్షకుల్లో రాశికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. హోమ్లీ హీరోయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది ఈ నటి. అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ పెళ్లి తరువాత మాత్రం సినిమాలకు దూరమైంది.

రీసెంట్ గా సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి అమ్మ పాత్రలు చేస్తోంది. 'కళ్యాణ వైభోగమే' సినిమాలో మాళవిక నాయర్ తల్లి పాత్రలో చక్కగా నటించింది. తాజాగా ఈ బ్యూటీ ఓ టీవీ షోలో పాల్గొంది. ఇందులో తన వ్యక్తిగత విషయాలు, వృత్తిపరమైన విషయాలకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేసింది. అప్పట్లో రాశి.. హీరో వెంకటేష్ లేదా రాజీవ్ గాంధీలను పెళ్లి చేసుకుంటానని చెప్పేదట.

పవన్ కోసం నన్ను సెలెక్ట్ చేసింది సురేఖగారే.. 'రంగస్థలం' అందుకే ఒప్పుకోలేదు!

ఈ విషయాన్ని హోస్ట్ ప్రశ్నించగా రాశి నవ్వేసింది. వెంకటేష్ కి ఆ విషయం చెప్పారా..? అని అడిగితే లేదని చెప్పి సిగ్గుపడింది. ఆ తరువాత 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ ముందుగా తనను అనుకున్నారని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. అనంతరం దర్శకుడు తేజ తనను మోసం చేసిన విషయాన్ని బయటపెట్టింది. 

అప్పటివరకు రాశి అంటే హోమ్లీ హీరోయిన్, బోల్డ్ సీన్స్ చేయదనే ఇమేజ్ ఉండేది. కానీ 'నిజం' సినిమాలో ఆమెని చూసిన వారంతా షాక్ అయ్యారు. అసలు రాశియేనా ఇలాంటి రోల్ లో చేసిందంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఒక విధంగా ఈ సినిమా రాశి ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది.

ఈ విషయంపై స్పందించిన రాశి.. దర్శకుడు తేజ తను మోసం చేశాడని చెప్పింది.  క్యారెక్టర్ అధ్బుతంగా ఉంటుందని నమ్మించి, మోసం చేసి సినిమాకి కమిట్ చేయించారని వెల్లడించింది. సినిమాలో గోపీచంద్, మీరు లవర్స్ అని..మీ మధ్యలోకి విలన్ వస్తాడని.. సినిమా మొత్తం మీ లవ్ స్టోరీయే అని.. తేజ పాజిటివ్ గా చెప్పుకొచ్చినట్లు వెల్లడించింది. సినిమాలో తన పాత్రలో నెగెటివ్ యాంగిల్ ఉంటుందనే విషయం చెప్పకుండా మోసం చేసి సినిమాలో నటింపజేశారని ఆవేదన వ్యక్తం చేసింది.