బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం నాటి ఎపిసోడ్ తో ముగిసిపోయింది. రాహుల్, శ్రీముఖిల మధ్య గట్టి పోటీ ఏర్పడగా.. అత్యధిక ఓట్లు దక్కించుకొని టైటిల్ తన్నుకుపోయాడు రాహుల్ సిప్లిగంజ్. దీంతో శ్రీముఖి రన్నరప్ కి పరిమితమైంది. మొదటి నుండి రాహుల్ కంటే అన్ని విషయాల్లో తనే బెటర్ అని భావించిన శ్రీముఖి టైటిల్ గెలవలేకపోయాననే విషయాన్ని 
భరించలేకపోయింది.

అందరిముందే తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. హోస్ట్ నాగార్జున.. రాహుల్ విన్నర్ అని అనౌన్స్ చేసిన తరువాత శ్రీముఖిని మాట్లాడమని అడిగారు. దానికి ఆమె.. ఓటమిని ఎవరూ ఇష్టపడరని.. ముఖ్యంగా తను ఓటమిని యాక్సెప్ట్ చేయలేనని.. తన బ్లడ్ లోనే ఓటమి లేదని తన బాధని వెళ్లగక్కింది.

షాకింగ్ : హీరోయిన్ సంజనతో అల్లు అరవింద్ అడల్ట్ జోక్స్

కానీ ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి కూడా 'నువ్ కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నావంటూ' శ్రీముఖిని ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే శ్రీముఖి మాత్రం.. తలరాత అని, అదృష్టం ఉంటే గెలుపు దక్కేది అంటూ స్టేట్ పైనే కామెంట్స్ చేసింది.

ఆమె మాటలు రాహుల్ పై అక్కసుని వ్యక్తం చేసినట్లుగా ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. రాహుల్ ఏం చేయకుండానే.. అదృష్టం వలన గెలిచాడు అన్నట్లుగా శ్రీముఖి కామెంట్స్ చేసిందంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. మొదటి నుండి టైటిల్ తనదేనని ఫిక్స్ అయిన శ్రీముఖికి రాహుల్ సక్సెస్ పెద్ద షాక్ ఇచ్చిందని పలువురు  అభిప్రాయపడుతున్నారు. 

విజేతగా నిలిచినా రాహుల్ కి కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకపోవడంపై నెటిజన్లు శ్రీముఖిని విమర్శిస్తున్నారు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించే శ్రీముఖి అంత పెద్ద స్టేజ్ పై సరిగ్గా ప్రవర్తించలేదని అంటున్నారు. ఓటమిని అంగీకరించాలే తప్ప.. గెలుపుని తప్పుబట్టడం కరెక్ట్ కాదంటూ ఆమె తీరుని విమర్శిస్తున్నారు.