బిగ్ బాస్ షో మరికొద్దిరోజుల్లో ముగుస్తుండడంతో షో రసవత్తరంగా మారింది. రీసెంట్ గా హౌస్ మేట్స్ కి ఇచ్చిన టికెట్ టు ఫినాలే టాస్క్ లో రాహుల్ గెలిచాడు. దీంతో అతడు నేరుగా ఫైనల్ లిస్ట్ లోకి చేరాడు. మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు.

అయితే తమని తాము ఎలిమినేషన్ నుండి కాపాడుకోవడం కోసం, తమ టాలెంట్ నిరూపించుకోవడానికి బిగ్ బాస్ బుధవారం నాడు హౌస్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లకు రాహుల్ సంచాలకుడిగా వ్యవహరించారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వరుణ్, బాబా భాస్కర్, అలీ, శ్రీముఖి, శివజ్యోతిలను గార్డెన్ ఏరియాలో ఉన్న నామినేషన్ బాక్స్ లో నిలబడాలని చెప్పిన బిగ్ బాస్ వారి కోసం ఐదు టాస్క్ లను సిద్ధం చేశాడు.

 

అందులో ఒక్కొక్కరూ ఒక్కో టాస్క్ ఎన్నుకునే ఛాన్స్ ఉండడంతో ముందుగా వరుణ్ టాస్క్ చేయడానికి ముందుకొచ్చాడు. ఈ టాస్క్ ప్రకారం  రాహుల్ ఓ కర్రని రింగ్ లో ఉండే నిప్పుకి అంటుకోకుండా పట్టుకొని ఉండాలి. బాబా భాస్కర్ ఓ పోల్ పై నిలబడి ఉండాలి.. శివజ్యోతి.. పచ్చి పాలలో గుడ్లు కలుపుకొని తాగాలి.

నన్నెవరూ అరెస్ట్ చేయలేదు.. నేనే మీకు చెబుతా: బండ్ల గణేష్!

అలీ రెజా.. బస్తాలను కిందకి దించకుండా వాటిని గాల్లోనే ఉండేలా చూసుకోవాలి. ఇక శ్రీముఖి తనకు ఇచ్చిన టాస్క్ లో భాగంగా చేప నోట్లో ఉన్న మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తూ ఉండాలి. ఇవన్నీ బిగ్ బాస్ రిలీజ్ చెప్పే వరకు చేస్తూ ఉండాలి. ఈ టాస్క్ లను పూర్తి చేయడానికి ఇంటి సభ్యులు నానా తంటాలు పడ్డారు. ఫైనల్ గా అందరూ తమకిచ్చిన టాస్క్ లను పూర్తి చేశారు.