బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఈ షోతో ఎవరికీ రానంత క్రేజ్ రాహుల్ కి వచ్చింది. షో నుండి బయటకి రాగానే సెలబ్రిటీగా చాలా బిజీ అయిపోయాడు. పాటలు, లైవ్ కన్సర్ట్స్, షోలు అంటూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. 2019 రాహుల్ కి బాగానే కలిసొచ్చింది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కానీ.. బయటకి వచ్చిన తరువాత పలు ఇంటర్వ్యూలలో కూడా రాహుల్ ఒకటే కోరికను చెబుతుండేవాడు. తన ఫ్యామిలీ ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటుందని.. ఎప్పటికైనా ఓ సొంతిల్లు కొనాలనేది తన కల అని చెప్పేవాడు. ఆ తరువాత సెలూన్ ఓపెన్ చేయాలని అన్నారు.

అయ్యో సునీల్.. ఒక్క డైలాగ్ కూడా లేదే!

అయితే రియాలిటీకి వచ్చేసరికి.. రాహుల్ హౌస్ నుండి బయటకి రాగానే లగ్జరీ హెయిర్ సెలూన్ ఓపెన్ చేశాడు. ఇక రీసెంట్ గా రాహుల్ మెర్సిడెజ్ బెంజ్ కారు కొన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో నెటిజన్లు రాహుల్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మిడిల్ క్లాస్ అనే ట్యాగ్ తో ఎక్కువ ఓట్లు సంపాదించుకోవడం కోసం రాహుల్ హౌస్ లో అలా ఉండేవాడని.. ఓటర్లను అతడు చీట్ చేశాడంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

'ఉండడానికి ఇల్లు లేదని చెప్పావ్.. కానీ లగ్జరీ సెలూన్ ఓపెన్ చేసావ్.. కాస్ట్లీ కారు కొన్నావ్.. అంటే అబద్ధాలు చెప్పి మమ్మల్ని చీట్ చేశావా..?' అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించిన రాహుల్.. కారు కన్నా ముందే ఫ్లాట్ కోనేశానని వెల్లడించాడు.

అది పూర్తిగా సిద్ధం కావడానికి మరో ఏడు నెలలు పడుతుందని సమాధానమిచ్చాడు. ఇప్పుడు నటుడిగా కూడా టర్న్ తీసుకున్నాడు రాహుల్. కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాతో నటుడిగా వెండితెరకి పరిచయం కానున్నాడు.