బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో సీజన్ 3 పూర్తి చేసుకోబోతుంది. ఈ షోలో కంటెస్టంట్ గా పాల్గొన్న కమెడియన్ మహేష్ విట్టా కొద్దిరోజుల క్రితం ఎలిమినేట్ అయ్యాడు. అలా బయటకి వచ్చిన మహేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిజానికి మహేష్ విట్టా 'బిగ్ బాస్ 2'కి వెళ్లాల్సిందట. కానీ 'కృష్ణార్జున యుద్ధం' సినిమా షూటింగ్ లో ఉండడంతో కుదరలేదట. 

హీరో నాని బిగ్ బాస్ లోకి మహేష్ విట్టా వస్తే బాగుంటుందని చెప్పడంతో తనను పిలిచారని.. నాని మాట సాయం వలనే తను బిగ్ బాస్ షోలోకి రాగలిగానని చెప్పాడు. ఇక హౌస్ లో పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. హౌస్ లో ప్రతీ ఒక్కరికీ చాలా మెంటల్ టెన్షన్ ఉంటుందని చెప్పాడు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ల కారణంగా హౌస్ లో చిన్న చిన్న గొడవలు  జరిగేవని.. వాటిని చాలా పెద్దగా చిత్రీకరిస్తారని మహేష్ చెప్పుకొచ్చారు. 

బిగ్ బాస్ 3: వరుణ్ తో రాహుల్ కొట్లాట.. బాబాపై విరుచుకుపడ్డ అలీ

మళ్లీ మరుసటి రోజు లేచాక గొడవ పడిన వారి మొహాలే చూడాలి కాబట్టి ప్రతీ ఒక్కరికీ చాలా మెంటల్ టెన్షన్ ఉంటుందని బయటకి చెప్పుకోలేమని.. మీరు చూస్తున్నది వేరు.. లోపల జరుగుతున్నది వేరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. హౌస్ లో ఫుడ్ కి చాలా ఇబ్బంది పడ్డామని.. ఒక్కోసారి వారానికి సరిపడా పంపించే రేషన్ లో నిత్యావసర సరుకులు ఉండవని.. కూరగాయలు కూడా ఫ్రెష్ గా ఉండవని చెప్పుకొచ్చారు.

నిజానికి హౌస్ లో ఏం జరుగుతుందనే విషయాలు పూర్తిగా నాగార్జున గారికి కూడా తెలియనివ్వరని, వారు ఇచ్చిన స్క్రిప్ట్ ని మాత్రం ఆయన ఫాలో అవుతారని.. ఆయన కూడా  ఎవరినీ బలవంతంగా తిట్టే వ్యక్తి కాదని, ఇబ్బంది పెట్టేవారు కాదని.. ఆట విషయంలో తనను ఎంతో ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు. నాగార్జున గారు దసరా రోజు జౌసే లోకి వచ్చినప్పుడు ఎంతో బాగా మాట్లాడారని.. అవి తనకు హ్యాపీ మూమెంట్స్ అని చెప్పాడు మహేష్.

హౌస్ లో తనకు బాగా నచ్చిన వ్యక్తి బాబా భాస్కర్ అని వెల్లడించాడు. ఓట్ల ప్రకారంగా రాహుల్ విన్నర్ అని.. లోపల ఏదైనా రాజకీయాలు జరిగితే మాత్రం శ్రీముఖి విన్నర్ కావొచ్చని.. ఆ రాజకీయాలు ఏంటనేవి మాత్రం చెప్పనని అన్నాడు. పునర్నవి, రాహుల్ మధ్య ఏదో ఉందన్నట్లు టెలికాస్ట్ చేశారని.. అక్కడ అదేంలేదని తెలిపాడు.