ఆదివారం ఎపిసోడ్ లో వితికా హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడంతో వరుణ్ కాస్త డల్ అయ్యాడు. కానీ సోమవారం ఉదయం ఎప్పటిలానే యాక్టివ్ అయిపోయాడు. మరో రెండు వారాలలో షో ముగుస్తుండడంతో టాస్క్ లను మరింత కష్టంగా డిజైన్ చేశారు బిగ్ బాస్. ఈ వారం నామినేషన్ ప్రాసెస్ లో భాగంగా బిగ్ బాస్ 'బేటరీ ఉండే నిండుగా.. చేసుకోండీ పండగా' అనే టాస్క్ ఇచ్చారు.

ఇందులో ఒక్కో కంటెస్టెంట్ ని కలర్ ప్లేట్ ఎన్నుకోమని బిగ్ బాస్ చెప్పారు. వారు ఎన్నుకున్న కలర్ ప్లేట్ వెనుక బేటరీ పర్సన్టేజ్ నెంబర్ లు ఉన్నాయి. ఇందులో అందరికంటే అలీ బేటరీ లైఫ్ ఎక్కువగా డెబ్బై శాతం వచ్చింది. ఇక టాస్క్ లో మూడు సార్లు బేటరీ రీఫిల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య ఒక్కో రకమైన టాస్క్ జరుగుతుంటుంది.

ముందుగా అలీ, శివజ్యోతిలకు  అరటిపండ్ల టాస్క్ ఇచ్చారు. ఎవరైతే ఎక్కువ అరటిపళ్లు తింటారో వారికి బేటరీ రీఫిల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇందులో అలీ నెగ్గి తన బేటరీ లైఫ్ పెంచుకున్నారు. మరో టాస్క్ లో వరుణ్, రాహుల్ ల మధ్య ఫిజికల్ టాస్క్ జరిగింది. ఎవరి బ్యాగ్ లో థెర్మోకోల్ బాల్స్ ఎక్కువ ఉంటాయో వారే గెలిచినట్లు బిగ్ బాస్ చెప్పారు. ఈ ప్రాసెస్ లో రాహుల్, వరుణ్ ఒకరితో మరొకరు ఫిజికల్ గా ఎటాక్ చేసుకున్నారు.

 

ఫైనల్ గా రాహుల్ గెలిచాడు. ఇక అందరికంటే కష్టమైన టాస్క్ శ్రీముఖి, బాబా భాస్కర్ లకు వచ్చింది. ఈ టాస్క్ లో బాబా గెలిచాడు. ఈ ప్రాసెస్ ఫైనల్ అయ్యేసరికి అలీ 70%, శివజ్యోతి 40%, రాహుల్ 50%, వరుణ్ 20%, బాబా భాస్కర్ 40%, శ్రీముఖి 30% బేటరీ లైఫ్ తో ఉన్నారు. అయితే హౌస్ మేట్స్ అందరికీ కలిపి ఒకసారి బేటరీ రీఫిల్ చేసుకునే ఛాన్స్  వచ్చింది. ఇందులో అలీ, బాబా ముందుగా బెల్ మోగించడంతో వారిద్దరికీ టాస్క్ ఆడే ఛాన్స్ వచ్చింది.

ఈ టాస్క్ లో భాగంగా వీరిద్దరూ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన మట్టి పెట్టెలో తలా ఒక రంగు పూలను ఎన్నుకొని ఆ తరువాత ఆ మట్టిలో పూలను పాతాల్సివుంటుంది. ఎండ్ బజర్ మోగే సమయానికి మట్టి పెట్టెలో ఎవరి పువ్వులు ఎక్కువ ఉంటాయో వారు తమ బేటరీని రీఫిల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

 

ఈ ప్రాసెస్ రేపటి ఎపిసోడ్ లో కంటిన్యూ అవ్వనుంది. ఇందులో ఎవరైతే నెగ్గుతారో.. వారు నేరుగా టికెట్ టు ఫినాలేకి ఎంపిక కానున్నారు. మిగిలిన వారిలో ఎవరి బేటరీ లైఫ్ తక్కువగా ఉంటుందో వారు ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ కానున్నారు. ఆ విషయాలు సోమవారం ఎపిసోడ్ లో తెలియనున్నాయి .