బిగ్ బాస్ సీజన్ 3 నిన్నటితో ముగిసింది. రాహుల్, శ్రీముఖిల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో ఎవరు విజేతగా గెలుస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఫైనల్ గా నాగార్జున.. రాహుల్ ని విజేతగా ప్రకటించారు. మెగాస్టార్ చేతుల మీదుగా రాహుల్ బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నాడు.

షో ముగిసిన తరువాత బిగ్ బాస్ కంటెస్టంట్లు ఇంటి బాట పట్టారు. విన్నర్ గా నిలిచిన రాహుల్, రన్నరప్ గా నిలిచిన శ్రీముఖిలకు గ్రాండ్ వెల్కం చెప్పారు. వారితో కలిసి ఫోటోలు తీసుకోవడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. రాహుల్ గెలుపుతో మాస్ ఫ్యాన్స్ అంతా తీన్మార్ డాన్స్ లు వేశారు. 

Bigg Boss3: బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్.. శ్రీముఖి ఆశలు గల్లంతు!

షో నుండి బయటకి వచ్చిన రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు లెజండ్స్ చేతుల మీదుగా టైటిల్ తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని.. ఈ విజయంతో తన లైఫ్ చేంజ్ అవుతుందనే నమ్మకం ఉందని.. ఓట్లు వేసి గెలిపించిన కోట్లాది మందికి ధన్యవాదాలు చెప్పారు.

తన సంతోషంగా హద్దులు లేవని.. మిడిల్ క్లాస్ నుండి వచ్చిన తనను వేరే లెవెల్ కి తీసుకువెళ్లారని అన్నాడు. స్ట్రాటజీతో కన్నా.. నిజాయితీగా ఆడినట్లుఅదే తన సక్సెస్ కి కారణమైందని చెప్పుకొచ్చాడు. రాహుల్ అభిమానులు అతడికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

తన అభిమానులతో కాసేపు ముచ్చటించిన రాహుల్ వారికి ధన్యవాదాలు చెప్పాడు. ఇక శ్రీముఖి అభిమానులు ఆమెకి పూలమాలలతో స్వాగతం పలికారు. ఇంటికి చేరుకున్న శ్రీముఖి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.