బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకి చేరుకోనుంది. పదిహేడు మందికంటెస్టంట్స్ తో ఈ షో మొదలుకాగా ఫైనల్స్ కి ఐదుగురు చేరుకున్నారు. వీరిలో శ్రీముఖి, రాహుల్ ల మధ్య ఓటింగ్ విషయంలో పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఒకరు విజేతగా నిలవనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇది ఇలా ఉండగా.. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. హౌస్ వారి వంద రోజుల జర్నీని వీడియోగా రూపొందించి ప్లే చేశారు. ముందుగా వరుణ్ ని పిలిచి వీడియో చూపించగా.. అతడు ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత రాహుల్ ని పిలిచి వీడియో ప్లే చేశారు.

Bigg Boss 3: వీడియో చూసి ఏడ్చేసిన బాబా భాస్కర్!

అది చూసిన రాహుల్ తనను చూసుకొని ఎంతో గర్వంగా ఉందని ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆ తరువాత బాబా భాస్కర్ తన వీడియో చూసుకొని ఏడ్చేశాడు. నిజంగా చెప్పాలంటే వీరి ముగ్గురిలో బాబా వీడియోకి కాస్త ఎలివేషన్ ఇచ్చారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో శ్రీముఖి, అలీల వీడియోలు ప్లే చేయనున్నారు. అంతేకాదు.. ఈరోజు ఎపిసోడ్ లో మరో సర్ప్రైజ్ ఉండనుంది. 

హౌస్ నుండి ఎలిమినేట్ కంటెస్టెంట్స్ అందరినీ మరోసారి హౌస్ లోకి  తీసుకురానున్నారు. వీరిలో హేమ వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మిగిలిన వారంతా హౌస్ లో మరోసారి సందడి చేయబోతున్నారు. శుక్రవారం ఎపిసోడ్ లో కూడా వీరు కనిపించబోతున్నారు. ఆ తరువాత శనివారం ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది.

కాబట్టి ఎలిమినేట్ అయిన సభ్యులు కూడా సోమవారం వరకు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. గత రెండు సీజన్లలో కూడా సీజన్ ఫైనల్ చేరుకునే దశలో ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్ ని హౌస్ లోకి పంపించి కాస్త ఎంటర్టైన్మెంట్ఇచ్చారు. ఈసారి కూడా అదే ఫాలో అవనున్నారు.