బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకి చేరుకుంది. పదిహేడు మంది కంటెస్టంట్స్ తో మొదలైన ఈ షో ఫైనల్ వీక్ కి చేరుకునేసరికి హౌస్ లో ఐదుగురు కంటెస్టంట్స్ మిగిలారు. వీరిలో ఎవరు విజేతగా నిలవబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ కి వారు వెళ్లిపోయే ముందు హౌస్ లో వారి జర్నీని వీడియోగా ప్లే చేసేవారు.

ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వంద రోజులు పూర్తయ్యాయి. దీంతో ఈసారి ఇంటి సభ్యులకు బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటివరకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో వాడిన  వస్తువులతో ఓ గదిని మ్యూజియంగా ఏర్పాటు చేశారు. ఆ రూమ్ లోకి ఒక్కో కంటెస్టంట్ ని పిలిచి బిగ్ బాస్ ఇంట్లో కొనసాగిన వారి జర్నీని చూపించారు.

ముందుగా వరుణ్ ని పిలిచిన బిగ్ బాస్.. ప్రేక్షకులు తనను మిస్టర్ పెర్ఫెక్ట్, ప్రాబ్లం సాల్వర్ అని పిలుచుకుంటున్నారని వరుణ్ పై పొగడ్తలు కురిపించారు. అనంతరం అతడికి సంబంధించిన వీడియో ప్లే చేశారు. అందులో వరుణ్ ఇన్ని రోజుల పాటు బిగ్ బాస్ లో తన జర్నీ ఎలా కొనసాగించారో చూపించారు.

 

 

అది చూసిన వరుణ్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత రాహుల్ ని పిలిచి ఎలాంటి గేమ్ ప్లానింగ్ లేకుండా మీ ధోరణిలో ఆడుకుంటూ వెళ్లారని ప్రేక్షకుల హృదయాలను  గెలుచుకున్నారని బిగ్ బాస్ చెప్పారు. అనంతరం రాహుల్ కి వీడియో ప్లే చేసి చూపించారు.

వీడియో చూసిన రాహుల్ ఎమోషనల్ అవుతూ తనకు ఎంతో గర్వంగా ఉందని.. ఈ షో తరువాత తనకు మంచి లైఫ్ దొరుకుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆ తరువాత బాబా భాస్కర్ ని పిలిచారు బిగ్ బాస్. బాబా వీడియోను మొదలుపెట్టే ముందే అతడి క్యారెక్టర్ ని వివరిస్తూ చాలా టైటిల్స్ వేశారు. ఆ వీడియో మొత్తం చూసిన బాబా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశారు.