ప్రముఖ టీవీ ఛానెల్ లో తీన్మార్ సావిత్రిగా పాపులారిటీ దక్కించుకుంది శివజ్యోతి. మాస్ వార్తలు చదవడంలో ఆమెకి ప్రేక్షకుల్లో మంచి పేరుంది. ఇక బిత్తిరి సత్తితో కలిసి ఆమె చేసిన తీన్మార్ వార్తల షో  సూపర్ హిట్ అయింది. అదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్స్ దక్కించుకుంది శివజ్యోతి. ఈ రియాలిటీ షోలో తన గేమ్ తో మంచి పేరే తెచ్చుకుంది. 

గతవారంలో శివజ్యోతి హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. అలా బయటకి వచ్చిన తరువాత పలు టీవీ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ క్రమంలో బిత్తిరిసత్తితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది.

హిట్టుతో వరస ఫ్లాపుల దెబ్బ.. కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టింది!

తామిద్దరం ఛానెల్ లో కలిసి పని చేసినప్పుడు అన్నాచెల్లెల్లా కలిసి ఉండేవాళ్లమని, తెరపై అక్కా తమ్ముళ్ల అనుబంధమైనా.. నిజ జీవితంలో మాత్రం తమది అన్నా చెల్లెల్ల బంధమని చెప్పింది. బిత్తిరిసత్తి ఏ పని  చేయాలనుకున్నా తన అభిప్రాయాన్ని అడిగేవాడని.. తన నిర్ణయంపై అంత నమ్మకం ఉండేదని చెప్పుకొచ్చింది శివజ్యోతి.

అంతేకాదు.. తను బిగ్ బాస్ షోకి వెళ్తానంటే.. బిత్తిరిసత్తి వద్దని చెప్పాడని.. కానీ ఓ మహిళాగా తన వరకు మంచి గుర్తింపు సంపాదించుకున్నానని.. ఇంకా ఏదైనా సాధించాలనే కసితోనే బిగ్ బాస్ షోకి వెళ్లినట్లు చెప్పుకొచ్చింది శివజ్యోతి. బిగ్ బాస్ షోకి వెళ్తున్నట్లు తాను బిత్తిరిసత్తికి చెప్పలేదని వెల్లడించింది.

ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఉంటుందని చెప్పింది శివజ్యోతి. తనకంటే బిత్తిరిసత్తికే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆయనకున్న డిమాండ్ అలాంటిదని పేర్కొంది. బిట్టిరిసత్తి ఎన్నో ఆశలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారని.. అతడు సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని శివజ్యోతి చెప్పుకొచ్చింది.