బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం నాటి ఎపిసోడ్ తో పూర్తయిన సంగతి తెలిసిందే. రాహుల్, శ్రీముఖిల మధ్య గట్టి పోటీ ఏర్పడడంతో టైటిల్ ఎవరు గెలుచుకుంటారనే ఆసక్తి క్రియేట్ అయింది. ఫైనల్ గా రాహుల్ ట్రోఫీ అందుకొని శ్రీముఖికి షాక్ ఇచ్చాడు. గత రెండు సీజన్లలో మేల్ కంటెస్టంట్సే టైటిల్ దక్కించుకున్నారు.

కనీసం ఈసారైనా అమ్మాయికి ట్రోఫీ వస్తుందని ఆశించారు. కానీ అది జరగలేదు. శ్రీముఖి అభిమానులు ఇదే పాయింట్ తీసుకొని ఎంతగా ప్రచారం చేసిన ఉపయోగం లేకుండా పోయింది. ఓసారి హౌస్ లో శ్రీముఖి తను జెండర్ కార్డ్ వాడనని చెప్పింది. అయితే ఆమె కుటుంబసభ్యులు మాత్రం #THISTIMEWOMAN అంటూ ప్రచారం నిర్వహించారు.

Bigg Boss 3: నాగార్జున తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే..?

గత సీజన్ లో గీతామాధురికి ట్రోఫీ వస్తుందని ఆశిస్తే పరిస్థితులు మారిపోవడంతో కౌశల్ కి ఇచ్చారు. దీంతో ఆమె రన్నరప్ గా నిలిచింది. ఈసారి శ్రీముఖి ట్రోఫీ అందుకుంటుందని భావించారు. కానీ రాహుల్ ముందు శ్రీముఖి ఓడిపోయింది. దీంతో రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సివచ్చింది. బిగ్ బాస్ రిజల్ట్ తో ఓ వర్గం ఆడియన్స్ నిరాశ చెందారు. కొంతమంది  సెలబ్రిటీలు సైతం బిగ్ బాస్ ఫలితంపై విమర్శలు చేస్తున్నారు.

తాజాగా ప్రముఖ యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా.. బిగ్ బాస్ ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బిగ్ బాస్ వీక్షకులు మహిళను గెలిపించడానికి సిద్ధంగా లేరని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ పెట్టింది.

అమెరికా వంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిని చేయాలనుకోవడం లేదు. అలాంటిది తెలుగు ప్రేక్షకులు మాత్రం బిగ్ బాస్ విన్నర్ గా మహిళను ఎందుకు గెలిపిస్తారని వ్యంగ్యంగా ప్రశ్నించింది. లింగబేధం ఇంకా ఉనికిలోనే ఉందంటూ కామెంట్ చేసింది. బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి తన బెస్ట్ ఇచ్చిందని ఝాన్సీ ప్రశంసలు కురిపించింది.