బిగ్ బాస్ సీజన్ 3 మరికొద్ది రోజుల్లో పూర్తికానుంది. దీంతో టాస్క్ లను కాస్త కఠినతరం చేసేసారు. ఈ వారం ఓ కంటెస్టంట్ హౌస్ నుండి బయటకి వెళ్లనున్నారు. ఈ వారంలో జరిగిన టికెట్ టు ఫినాలే టాస్క్ లో రాహుల్ గెలుపొందగా.. మిగిలిన ఐదుగురు కంటెస్టంట్లు వరుణ్, బాబా, శ్రీముఖి, శివజ్యోతి, అలీ ఎలిమినేష్ కి నామినేట్ అయ్యారు. నిన్న జరిగిన 'హౌ క్లీన్ ఈజ్ యువర్ జర్నీ' అనే టాస్క్ లో శ్రీముఖి గెలుపొంది ఆడియన్స్ ని ఓట్లు అడిగే ఛాన్స్ దక్కించుకుంది.

విజయ్ ‘విజిల్’ తెలుగు రివ్యూ..!

అయితే ఈ వారం చివరి ఎలిమినేషన్ కావడంతో హౌస్ మేట్స్ లో ఒకరకమైన టెన్షన్ కనిపిస్తోంది. అలీ తను వెళ్లిపోతానని ఫిక్స్ అయిపోయాడు. శివజ్యోతి కూడా తరచూ ఎలిమినేషన్ గురించి మాట్లాడుతూ టెన్షన్ పడుతోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ షాక్ ఇచ్చాడు. అందరూ పడుకున్న సమయంలో సైరన్ మోగించి వారిని నిద్ర లేపాడు.

ఉన్నపళంగా వారి బ్యాగులను సర్దుకొని  గార్డెన్ ఏరియాకి వెళ్లాల్సిందిగా ఆర్డర్ చేశారు. అయితే ఇంత సడెన్ గా బ్యాగులు ఎందుకు సర్దుకోమన్నారనే విషయం ఈరోజు ఎపిసోడ్ లో తెలియనుంది. ఈసారి భిన్నంగా రెండు రోజుల ముందే నాగార్జున లేకుండా ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ ఎలిమినేషన్ పూర్తయితే బిగ్ బాస్ ఫైనల్ లెవెల్ చేరుకుంటుంది.

 

ఫైనల్స్ కి వెళ్లే కంటెస్టంట్స్ లో ఇప్పటికే రాహుల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. రాహుల్ తో పాటు శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ లు కూడా వెళ్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలీ, శివజ్యోతిలలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాక తప్పదని అంటున్నారు. అందరికంటే ఓట్లు శివజ్యోతికే తక్కువ వచ్చాయని కాబట్టి ఈ వీక్ ఆమె ఎలిమినేట్ అవుతుందని టాక్.