బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. దీంతో బిగ్ బాస్ టాస్క్ లను కఠినతరం చేశారు. సోమవారం నాడు 'టికెట్ టు ఫినాలే' టాస్క్ ఆడించారు బిగ్ బాస్. మొత్తం ఆరుగులో ఒక్కరికి మాత్రం ఆ ఛాన్స్ దక్కుతుంది. మిగిలిన ఐదుగురు ఈ వారం నామినేషన్ లో ఉండబోతున్నారు.

ఈ టాస్క్ కోసం రాత్రి, పగలూ తేడా లేకుండా హౌస్ మేట్స్ అందరూ టాస్క్ ల మీదే దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ టాస్క్ లో అలీ రెజా కాస్త ముందున్నాడు. నిన్నటి టాస్క్ ఈరోజు కూడా కంటిన్యూ అవ్వనుంది. ఈరోజు టాస్క్ లో అలీ, బాబా భాస్కర్ పోటీ పడనున్నారు. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన మట్టి పాత్రలో ఇద్దరూ ఒక్కోరంగు పూలను పాతాల్సి ఉంటుంది.

(Also Read) బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి ఆకాశంలోకి.. ప్లాప్ తో పాతాళంలోకి!

 

ఫైనల్ గా ఎవరి పూలు ఎక్కవ ఉంటాయో వారే గెలిచినట్లు.. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో అలీ.. బాబాపై విరుచుకుపడుతున్నారు. ఇద్దరూ ఒకరు నాటిన పూలను మరొకరు పీకేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఒక రకంగా ఇద్దరి మధ్య కుస్తీల పోటీ జరుగుతోంది. అలీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. బాబాని ఎత్తి అవతల పడేస్తున్నాడు.

ఒకరిపై మరొకరు పడుతూ, దొర్లుతూ పోరాడుతుంటే.. అదంతా చూస్తున్న హౌస్ మేట్స్ టెన్షన్ తో వణికిపోయారు. శ్రీముఖి గొడవ ఆపమని ఎంతగా అరుస్తున్నా అలీ మాత్రం పట్టించుకోకుండా తన దూకుడు ప్రదర్శించాడు. దీంతో టాస్క్ హింసాత్మకంగా మారిపోయింది. రసవత్తరంగా సాగిన ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.