హిందీలో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 13 నడుస్తోంది. ఈ షోలో సీరియల్ నటుడు సిద్ధార్థ్ శుక్లా అలానే నటి దేవోలినా భట్టాచర్జీ పాల్గొన్నారు. షో మొదలైన దగ్గర నుండి వీరిద్దరూ చాలా సార్లు గొడవ పడ్డారు. కానీ కొన్ని రోజులుగా ఇద్దరి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. 

సిద్ధార్థ్ నేరుగానే ఆమెని ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సింక్ దగ్గర సిద్ధార్థ్ చేయి పట్టుకొని దేవోలినా క్లీన్ చేయడం, ఇద్దరు తలుపు వద్ద నిలుచొని ప్రేమగా మాట్లాడుకోవడం వంటివి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ ఎంత దగ్గరైపోయారంటే.. దేవోలినా స్నానం చేయడానికి బాత్రూమ్ లోపలకి వెళ్లి పాటలు పాడుకుంటుంది.

సీరియల్ నటిని రేప్ చేసిన జూనియర్ ఆర్టిస్!

ఆమె పాటలు పాడడం విన్న సిద్ధార్థ్ బాత్రూమ్ బయటే నిల్చొని ఉన్నాడు. అంతేకాదు.. దేవోలినా వాయిస్ చాలా బాగుందని ఆమెని పొగడ్తల్లో ముంచెత్తాడు. ఈ విషయాన్ని  దేవోలినా పెద్దగా పట్టించుకోలేదు కానీ నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. ఓ ఆడపిల్ల స్నానం చేస్తుంటే మగాడు బయట నిలబడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

అయితే బిగ్ బాస్ ప్రేక్షకులకు మాత్రం వీరి మధ్య కెమిస్ట్రీ నచ్చుతుందనే చెప్పాలి. మరి ఈ రిలేషన్ ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.. ఇది ఇలా ఉండగా.. సిద్ధార్థ్ 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో తెలుగు వారికి కూడా దగ్గరయ్యాడు. ఇక దేవోలినా 'కోడలా కోడలా కొడుకు పెళ్లామా' అనే సీరియల్ ప్రధాన పాత్ర పోషించింది.