పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో యువ హీరో దొరికిపోయాడు.  తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నీకు నాకు డ్యాష్ డ్యాష్ అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైనా ప్రిన్స్  బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పోటీ చేశాడు.

నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్న హీరోలు (రీసెంట్ మూవీస్)

అయితే ఈ హీరో ఇటీవల హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో మద్యం సేవించి వాహనం నడిపినట్లు తేలింది.  ఈ నెల 24న బాచుపల్లి విఎన్ఆర్ కాలేజ్ దగ్గర నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో కొంతమంది మందు బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అందులో యువ హీరో ప్రిన్స్ సుశాంత్ కూడా ఉన్నాడు.డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో అతను మద్యం తాగినట్లు తేలింది.

కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ కూకట్ పల్లి లోని కోర్టుకు తరలించారు.  ఈ సందర్బంగా తన లాయర్లను వెంటబెట్టుకొని వచ్చిన ప్రిన్స్. కేసును విచారించిన కోర్టు ఫైన్ విధించింది. అనంతరం ఎవరికి కనిపించకుండా ప్రిన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బస్ స్టాప్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ప్రిన్స్ ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ లు అందుకోలేదు. ప్రస్తుతం కెరీర్ ని సెట్ చేసుకునేందుకు కొత్త తరహా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.