టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఓ కుర్ర హీరో ఇప్పుడు దర్శకులకు ఇబ్బందిగా మారాడని సమాచారం. అతడు మంచి నటుడే.. కానీ సినిమా స్క్రిప్ట్ లో, దర్శకుల పనిలో ఇన్వాల్వ్ అవుతూ వారికి సమస్యగా మారుతున్నాడట.

ఈ ప్రవర్తన వలనే ఇప్పటికే ఓ సినిమా ఆగిపోయింది.. అలానే ఇప్పుడు నటిస్తోన్న సినిమా డైరెక్టర్ కి, ఈ కుర్రహీరోకి మధ్య గొడవలు కూడా వస్తున్నాయని సమాచారం. హీరో గారి ఇన్వాల్వ్మెంట్ తో డైరెక్టర్ హర్ట్ అయ్యారట. అసలే ఆ డైరెక్టర్ ది సాఫ్ట్ నేచర్.. దీంతో హీరోకి సీరియస్ గా చెప్పలేకపోతున్నాడట.

హాట్ గురూ : అందాలతో పిచ్చెక్కిస్తున్న మాజీ హీరోయిన్

గతేడాది ఈ హీరో నటించిన సినిమా రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. హిట్ అవుతుందనుకున్న సినిమా ఫ్లాప్ కావడంతో కుర్రహీరో తట్టుకోలేకపోయాడు. దీంతో తన తదుపరి సినిమా విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా సినిమా టీజర్ కూడా వచ్చింది. కానీ దానిపై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి.

గతంలో అతడు నటించిన సినిమాలకు ఈ సినిమా టీజర్ కి పెద్దగా తేడా లేదని పెదవి విరిచారు. హీరోకి, డైరెక్టర్ కి మధ్య ఉన్న గొడవల కారణంగా అవుట్ పుట్ పై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.

హీరోగా సజెషన్స్ ఇవ్వడంలో తప్పులేదు కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూని కాదని.. తనకి నచ్చినట్లుగా సీన్స్ మార్చడం వంటివి చేస్తుండడంతో తట్టుకోలేని దర్శకుడు.. ఇక తన వల్ల కాదని తప్పుకున్నాడట. మరికొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు డైరెక్టర్ పక్కకి తప్పుకోవడంతో సినిమా డెవలప్మెంట్ విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి నిర్మాతలు డైరెక్టర్ ని కన్విన్స్ చేసి ప్రాజెక్ట్ పైకి తీసుకొస్తారో లేదో చూడాలి!