బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ నటించిన నూతన చిత్రం 'పతీ పత్నీ ఔర్ వో'. భూమి పడ్నేకర్, అనన్య పాండే హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ మొత్తం కామెడీతో నిండిపోయింది. ఇందులో వైవాహిక బంధం గురించి, తన భార్య గురించి హీరో కొన్ని డైలాగులు చెబుతాడు.

అది కామెడీగా ఉంటుందని మేకర్లు ఆలోచించినప్పటికీ ఇప్పుడే అవే వివాదాస్పదంగా మారాయి. హీరో తన భార్యని ఉద్దేశిస్తూ.. ''శృంగారం విషయంలో భార్య అనుమతి అడిగితే బిచ్చగాళ్లుగా.. ఆమెను తిరస్కరిస్తే మోసగాడిగా... ఇష్టం లేకున్నా బలవంతం చేస్తే అత్యాచారం చేసిన వాళ్లుగా ముద్రవేస్తారు'' అంటూ ఓ డైలాగ్ చెప్పాడు.

రానాతో లవ్ ఎఫైర్.. రకుల్ హాట్ కామెంట్స్!

ఇప్పుడు ఈ డైలాగ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. వైవాహిక అత్యాచారం కారణంగా ఎంతోమంది మహిళలు మానసిక వేదనను అనుభావిస్తున్నారని.. అలాంటి విషయం మీకు నవ్వులాటగా ఉందా..? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. డబ్బు కోసం ఎలాన్తిఉ పాత్రలైనా చేయడానికి సిద్ధపడతారా..? అంటూ సినిమాలో నటించిన హీరోయిన్లను టార్గెట్ చేస్తున్నారు.

దీనిపై స్పందించిన హీరోయిన్ భూమి పడ్నేకర్.. మహిళల సమస్యలను అపహాస్యం చేసే ఉద్దేశం తమకు లేదని అన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బ తీయాలనే ఉద్దేశం తమకి లేదని.. మమ్మల్ని క్షమించండి అంటూ కోరారు. ఈ సినిమాకి పని చేసిన ఏ ఒక్కరూ కూడా ఇతరుల మనోభావాలను హర్ట్ చేయాలని ఆలోచించరని.. సినిమాను కేవలం వినోద సాధనంగా మాత్రమే చూడాలని రిక్వెస్ట్ చేశారు.

1978లో విడుదలైన 'పతీ పత్నీ ఔర్‌ వో' సినిమా పేరుతో ముదస్సర్ అజీజ్‌ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డిసంబర్ 6న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.