బీహార్ లో సమస్తీపూర్ జిల్లాలో కొందరు దుండగులు భోజ్‌పురి నటుడిని తుపాకీతో కాల్చిచంపారు. ఈ ఘటన ముఫ్ఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సదరు నటుడిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. భోజ్‌పురి నటుడు మిథిలేష్ పాశ్వాన్ తన వాహనంపై ఆధార్ పూర్ గ్రామానికి వెళ్తున్నారు. అక్కడి ఖాదీ భండార్ కు చేరుకోగానే.. బైక్ పై వచ్చిన కొందరు దుండగులు మిథిలేష్ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ ఆపారు.

డబ్బుకోసం ఈ హీరోల మోసం.. ఫ్యాన్స్ ఫిదా!

ఆ తరువాత వారు మిథిలేష్ తో కొంతసేపు మాట్లాడారు. ఇంతలో వారిలో ఒక వ్యక్తి ఉన్నట్టుండి మిథిలేష్ పై కాల్పులు జరిపాడు. దీంతో అతడు కిందపడిపోయాడు. వెంటనే ఆ దుండగులు అక్కడ నుండి పారిపోయారు. స్థానికులు మిథిలేష్ ని హాస్పిటల్ కి తరలించగా.. అతడు చికిత్స పొందుతూ మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.